తెలంగాణ

అన్నదాతల బతుకులు అధ్వాన్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: అన్నదాతల బతుకులు సమైక్యాంధ్ర కంటే అధ్వాన్నంగా ఉన్నాయని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎ. రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ధ్వజమెత్తారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రైతుల రుణాన్ని పూర్తిగా మాఫీ చేయడానికి 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు మీకు మనసు రావడం లేదని ఆయన విమర్శించారు. మీ నిర్లక్ష్యం కారణంగా అప్పుల బాధలు తట్టుకోలేక తెలంగాణలో ఇప్పటి వరకు 2700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాలన బాగుందంటూ సర్వేల పేరిట ప్రచారం చేసుకుంటున్నారని టిడిపి నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అమర్‌నాథ్ బాబు, రాజు నాయక్ విమర్శించారు. ఆ సర్వేలపై కెసిఆర్‌కు నమ్మకం ఉంటే వివిధ పార్టీల నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించుకోవాలని వారు బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విసిరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సంగతి 90 రోజుల్లో తేల్చాలని సెప్టెంబర్ 20న హైకోర్టు స్పీకర్‌ను ఆదేశించిందని, ఇందులో ఇప్పటికే 50 రోజులు గడిచాయని వారు తెలిపారు.