తెలంగాణ

మహిళల కన్నీటితో... మద్యం వ్యాపారమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: మహిళల కన్నీటితో మద్యం వ్యాపారం చేస్తారా? అని తెరాస ప్రభుత్వంపై కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలో విచ్చలవిడి మద్యం అమ్మకాలను నిరసిస్తూ బిజెపి సీనియర్ నేత ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావు 24 గంటల పాటు నిర్వహించిన నిరాహార దీక్ష శనివారం ముగిసింది. పార్టీ జాతీయ నాయకులు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దత్తాత్రేయ మాట్లాడుతూ, బంగారు తెలంగాణ తెస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నారని నిందించారు. కేవలం ఆదాయాన్ని మాత్రమే చూసుకుంటే ఎలా? అని ప్రశ్నిస్తూ, మద్యం వ్యాపారంపై ఇప్పటికైనా పునస్సమీక్ష జరపాలని హితవు పలికారు. బెల్టు షాపులు లెక్కలేనన్ని పనిచేస్తున్నాయని, ఇప్పటికైనా వాటిని మూసివేయాలని డిమాండ్ చేశారు. శేషగిరిరావు దీక్షతో ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. దీనిని రాజకీయ వ్యవహారంగా చూడవద్దని, ప్రజల వాస్తవిక ఇబ్బందులను గమనంలోకి తీసుకుని తదనుగుణంగా నడుచుకోవాలని తెరాస సర్కారుకు సూచించారు. ఇటీవల మద్యం తాగి యువకులు చేసిన ప్రమాదాలతో చాలా కుటుంబాల్లో నిష్కారణంగా విషాదం అలుముకోవడం ఆందోళనకరమన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల వద్ద కూడా మద్యం దుకాణాలు ఉన్నాయని, బార్లలో చాలా మంది విద్యార్థులు కనిపిస్తున్నారని, ఈ సమస్యను అర్ధం చేసుకోవాలని దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు.
దీక్ష ముగింపు కార్యక్రమంలో బిజెపి జాతీయ నాయకుడు సోము వీర్రాజు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధరరావు తదితరులు పాల్గొని శేషగిరిరావును అభినందించారు.
మద్యపానం వలన ప్రజలు విపరీతంగా నష్టపోతున్నారని మురళీధరరావు అన్నారు. దేశాన్ని మార్చేందుకు బిజెపి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, దీనికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారని ఆయన చెప్పారు.