తెలంగాణ

రద్దయిన నోట్లతో ట్రాఫిక్ చలాన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మహానగర పాలక సంస్థ లాగే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం కూడా రవాణాదారులకు పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు ఓ ఆఫర్ ప్రకటించింది. తమ వద్ద ఉన్న పాత రూ. 1000, రూ. 500 నోట్లతో ట్రాఫిక్ చలాన్లు చెల్లించవచ్చని ట్రాఫిక్ డిసిపి ఎల్‌ఎస్ చౌహాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ-సేవ, మీ-సేవల ద్వారా సోమవారం సాయంత్రం వరకూ జరిమానాలు చెల్లించవచ్చని పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి ప్లాన్ సక్సెస్ అవడంతో ట్రాఫిక్ విభాగం కూడా ఈ ప్లాన్‌కు పూనుకుంది.