తెలంగాణ

కార్మికులకు అండగా ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: కార్మికులకు తమ పార్టీ అండగా ఉంటుందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న సిర్పూర్, నిజాం సుగర్స్ కార్మికులు నేడు కష్టాల్లో ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఆదివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో టిడిపి అనుబంధ విభాగమైన రాష్ట్ర టిఎన్‌టియుసి కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. టిఎన్‌టియుసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బిఎన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా ఎంకె బోస్‌తో పాటు ఎనిమిది మంది, ఉపాధ్యక్షులుగా ఎం. సత్యనారాయణతో పాటు పది మంది, కార్యాలయ సమన్వయ కార్యదర్శిగా బిఆర్ సుబ్రహ్మణ్య రావు, ట్రెజరర్‌గా కె.వెంకట రమణ, ప్రచార కార్యదర్శిగా కంది చంద్రయ్య తదితరులు మొత్తం 85 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఇ.పెద్దిరెడ్డి, అమర్‌నాథ్ బాబు, అరవింద్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.