రాష్ట్రీయం

26న హైదరాబాద్‌కు ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమిలో శనివారం జరుగనున్న డిజిపి, ఐజిపిల సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై సచివాలయంలో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ రెవిన్యూ, పోలీస్, జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సదస్సు నిర్వహణపై ప్రధాని కార్యాలయం సూచించిన మేరకు సంబంధిత శాఖలు ఏర్పాట్లు చేయాలని రాజీవ్ శర్మ ఆదేశించారు. రోడ్ల మరమ్మతులు, విద్యుత్ సరఫరా, పరిశుభ్రత, భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై రాజీవ్ శర్మ మార్గదర్శకం చేశారు. స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండిఎ, జిహెచ్‌ఎంసి అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సదస్సులో తీవ్రవాదం, ఉగ్రవాదం, సీమాంతర ఉగ్రవాదం, సైబర్ నేరాలు, శాంతి భద్రతలు తదితర అంశాలపై ప్రధానమంత్రి మోదీ డిజిపి, ఐజిపిలతో చర్చించనున్నారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో డిజిపి అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య, ఇంటెలిజెన్స్ ఐజి నవీన్ చంద్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజి గోపాల్‌తో పాటు బిఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, నేషనల్ ఎయిర్ పోర్ట్ అథారిటీ, మెట్రోవాటర్ వర్క్స్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై పోలీసులు, రెవెన్యూ అధికారులతో సమీక్షిస్తున్న తెలంగాణ సిఎస్ రాజీవ్ శర్మ