తెలంగాణ

ఎమ్సెట్ రద్దు చేస్తే మంచిదేమో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: ఎమ్సెట్ మెడికల్ స్ట్రీంలో కీలకమైన మెడికల్, డెంటల్ కాలేజీల్లో సీట్లు నీట్ పరిధిలోకి వెళ్లడంతో మిగిలిన బ్రాంచిల్లో అడ్మిషన్లను మార్కుల ప్రాతిపదికగా భర్తీ చేస్తే ఎమ్సెట్ ఒత్తిడిని విద్యార్థులపై తొలగించినట్టవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా ఇంజనీరింగ్ విభాగంలో సైతం ఉన్న సీట్లను మార్కుల ఆధారంగా భర్తీ చేస్తే ఎమ్సెట్‌ను నిర్వహించాల్సిన అవసరం ఉండదన్నది ప్రభుత్వ యోచనగా ఉంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థుల నుండి అభిప్రాయసేకరణ జరుపుతోంది.
ఎమ్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీం సీట్లను సైతం నీట్ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. ఎమ్సెట్‌ను రద్దు చేయడం వల్ల కార్పొరేట్ కాలేజీల పోటీ సగం తగ్గుతుందని, విద్యార్థులపై ఒత్తిడి కూడా పూర్తిగా తొలగించినట్టు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సైతం అధికారులతో మాట్లాడినపుడు ఎమ్సెట్ ప్రభావం గురించి చర్చించారు.
ఎమ్సెట్ అవసరమా? రద్దు చేస్తే మంచిదేమో అని అభిప్రాయపడినట్టు తెలిసింది. ఒక వేళ మార్పులు చేస్తే ఎలాంటి మార్పులు చేయాలనేదానిపై కూడా ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. పూర్తిగా ఎమ్సెట్‌ను తొలగించడమా లేక స్వల్ప మార్పులు చేయడమా అనే దానిపై యాజమాన్యాలు, విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. అయితే ఎమ్సెట్‌ను రద్దు చేయడం వల్ల అనేక కొత్త సమస్యలు ఏర్పడతాయని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ మధుసూదనరెడ్డి అభిప్రాయపడ్డారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
డిఎస్సీలో మార్పు
ఉపాధ్యాయుల నియామకానికి డిఎస్సీ ఎంపిక పరీక్ష తీరులో మార్పులు తెస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. మరో పక్క రాష్ట్రంలో అధికంగా ఫీజులు వసూలుచేస్తున్న 162ప్రైవేటు పాఠశాలలకు త్వరలో నోటీసులు ఇస్తామని ఆయన చెప్పారు.