తెలంగాణ

నగదు మార్పిడిపై పోస్ట్ఫాసుల్లో సిబిఐ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: హైదరాబాద్ పోస్ట్ఫాసుల్లో నగదు మార్పిడి, అవకతవకలపై సిబిఐ దృష్టి సారించింది. నగరంలోని ఏడు పోస్ట్ఫాసుల్లో అక్రమంగా నగదు మార్పిడి జరిగినట్టు శనివారం సిబిఐ గుర్తించింది. గోల్కొండ, సనత్‌నగర్, ఆబిడ్స్ జనరల్ పోస్ట్ఫాస్, పంజగుట్ట, హిమాయత్‌నగర్, నారాయణగూడ పోస్ట్ఫాసుల్లో దాదాపు పది కోట్ల మేరకు నగదు మార్పిడి జరిగినట్టు సమాచారం. కాగా సిబిఐ అధికారుల తనిఖీల సమాచారం అందుకున్న పోస్ట్ఫాస్ చీఫ్ సూపరింటెండెంట్ సుధీర్‌కుమార్ పరారయ్యారు. దీంతో ఉద్యోగులు రవితేజ, గోవిందరావు ఇళ్ళల్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. వీరి వద్ద నుంచి రూ. 3లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా వీరిపై ఇప్పటికే హిమాయత్‌నగర్‌లో రూ. 6 లక్షలకు పైగా అక్రమంగా నగదు మార్పిడికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఇదిలావుండగా సోదాల్లో భాగంగా సిబిఐ అధికారులు అదుపులో ఉన్న రవితేజ, గోవిందరావులను విచారించగా తాము తపాలశాఖ సూపరింటెండెంట్ సుధీర్‌కుమార్ ఆదేశాల మేరకే నగదును మార్పిడి చేసినట్టు తెలిపారని సిబిఐ అధికారులు తెలిపారు.