తెలంగాణ

కాంగ్రెస్ నేతల్ని కడిగేస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 8: రైతుల ఆత్మహత్యలు, వలసలు నివారించడానికి సాగునీటి ప్రాజెక్టులను కట్టాలని యోచిస్తే కాంగ్రెస్ నేతలు ప్రజలను తప్పుదారి పట్టించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారి తప్పులన్నింటిని ఎత్తి చూపించి అసెంబ్లీలో సబ్బుతో కడిగినట్లు కడిగేస్తానని సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టు వద్ద నిర్మించి సిలారపు రాజనర్సింహ ఎత్తిపోతల పథకాన్ని గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో స్వాతంత్రం వచ్చిన తరువాత మొట్టమొదటి సారిగా 40 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను నిర్మించడానికి ప్రభుత్వం సంకల్పిస్తే కాంగ్రెస్ అడ్డుతగులుతుందని విమర్శించారు. సింగూర్ ప్రాజెక్టును నిర్మించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షలు మాత్రమే ఎకరానికి పరిహారంగా చెల్లించిందని, తమ ప్రభుత్వం 8 నుంచి 10 లక్షలు చెల్లిస్తామంటే ఎందుకు ఆమోదయోగ్యం కాదని ప్రశ్నించారు. ప్రాజెక్టులు లేక, సాగు నీరు అందక ఎడారిగా మారిన తెలంగాణాను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులు కట్టడానికి ముందుకు కదిలితే కాళ్లలో కట్టెలు పెట్టి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
చనిపోయిన వారి పేర్లపై వేలి ముద్రలు వేసి కోర్టుల్లో దావాలు వేయించారని, అలాంటి కుట్రలు, కుతంత్రాలను బట్టబయలు చేసేందుకు పూర్తి ఆధారాలను సేకరించామని, డిసెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో సబ్బు పెట్టి కడిగిస్తానని పేర్కొన్నారు. ఎనిమిదేళ్లు పెద్ద కుర్చీలో కూర్చున్న పెద్దమనిషి కాలువల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసి ఎన్నికల సమయంలో చెరువులు నింపే ప్రయత్నం చేస్తే కట్టలన్ని ఎక్కడికక్కడే తెగిపోయాయన్నారు. కాంగ్రెస్ నేతల చిట్టాను విప్పి అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టి ప్రజలకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాళేశ్వరం, మల్లన్న సాగర్ రిజర్వాయర్ ద్వారా సింగూర్‌కు అనుసందానం చేసి 360 రోజులు నీరు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మానిక్యరాజ్ కణ్ణన్, ఎమ్మెల్యే బాబుమోహన్, ఇరిగేషన్ ఎస్‌ఈ పద్మారావు, ఈఈ రాములు, ఇంజనీర్లు, తహశీల్దార్లు, ఎంపిపిలు, జడ్పీటిసిలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం.. సింగూర్ ఎత్తిపోతల సాగునీటి పథకాన్ని ప్రారంభించిన అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు