తెలంగాణ

దిగువ జూరాల నుంచి జూన్ లోగా ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూర్, డిసెంబర్ 11: మహ బూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండ లంలో దిగువ జూరాల వద్ద చేపట్టిన జలవిద్యుత్ ప్రాజెక్టు ద్వారా 2016 జూన్ చివరి నాటికి ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లుగా తెలంగాణ జెన్‌కో డైరెక్టర్ వెంకటరాజం తెలిపారు. శుక్రవారం దిగువ జూరాల వద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఇప్పటికే రెండు యూనిట్లలో పనులు పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన నేపథ్యంలో మిగతా నాలుగు యూ నిట్ల ద్వారా వచ్చే సంవత్సరం జూన్ చివరి వరకు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు ప్రణాళికా బద్ధం గా పనులు వేగవంతం చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు.
గత సంవత్సరం జూలై 30న కృష్ణానది వరదనీటి ఉద్ధృతికి విద్యుత్ టర్బైన్లు మునిగిపోవడంతో ప్రాజెక్టు పనులు ఆలస్యం అయ్యాయని, నాటి నుంచి నేటి వరకు జెన్‌కో అధికారులు పనులు వేగవంతం చేస్తూ అనుకున్న సమయానికంటే ముందుగానే ప్రాజెక్టు పనులను పూర్తిచేసేందుకు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. దాదాపు రూ.1270 కోట్ల నిధులతో చేపట్టిన జూరాల జలవిద్యుత్ కేంద్రం పనులను పూర్తిచేసేందుకు ప్రభుత్వం విరివిగా నిధులు విడుదల చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు.
తెగిన బ్రిక్‌వాల్.. ప్రవేశించిన నీరు
ఇదిలా ఉండగా జెన్‌కో డైరెక్టర్ వెంకటరాజం విద్యుత్ పనులను పరిశీలించిన అనంతరం వెళ్లిపోయిన వెంటనే మూడవ యూనిట్‌లో కొనసాగుతున్న పనులలో భాగంగా బ్రిక్‌వాల్ తెగిపోవడంతో మూడవ యూ నిట్‌లోకి నీరు ప్రవేశించిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక పాత్రికేయులు పరిశీలించేందుకు వెళ్లగా జెన్‌కో అధికారులు లోపలికి అనుమతించకపోవడం విశేషం.

దిగువ జూరాల వద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు పనులను
పరిశీలిస్తున్న డైరెక్టర్ వెంకటరాజం