తెలంగాణ

ప్రైవేటు వర్శిటీల బిల్లుకు తుది రూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్శిటీలను నెలకోల్పేందుకు వీలు కల్పించే బిల్లుకు మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం నాడు తుది రూపం ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు మంత్రులు కెటిఆర్, పోచారం శ్రీనివాసరెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి కూడా హాజరయ్యారు. ప్రైవేటు వర్శిటీలకు తెలంగాణ రాష్ట్రంలో అనుమతి ఇవ్వడంపై క్యాబినెట్ సబ్‌కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. దేశవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రైవేటు వర్శిటీల నుండి కూడా డిమాండ్ పెరుగుతోందని సబ్‌కమిటీ అభిప్రాయపడింది. మారుతున్న విద్యా అవసరాలు, విద్యాప్రమాణాలు, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా మారాల్సి ఉందని మంత్రులు పేర్కొన్నారు. దేశంలో ఇంతవరకూ 246 ప్రైవేటు యూనివర్శిటీలకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయని, ప్రస్తుతం పనిచేస్తున్నాయన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, బ్రాండ్ ఇమేజీ వచ్చిన నేపథ్యంలో చాలా యూనివర్శిటీలు ఇక్కడ కూడా తమ కేంద్రాలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నాయని మంత్రులకు కడియం శ్రీహరి వివరించారు. ప్రైవేటు యూనివర్శిటీలకు అనుమతి ఇవ్వడంపై న్యాయపరమైన అంశాలపై ఇప్పటికే అదనపు ఎజి, ఇతర న్యాయనిపుణుల సలహాలను పొందామని, తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు వర్శిటీలకు అనుమతిచ్చే అంశంపై మరోసారి సమావేశమై చర్చించాలని కూడా నిర్ణయించింది.

చిత్రం..మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం