తెలంగాణ

విపక్షాల దాడిని తిప్పికొట్టేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభా, శాసనమండలిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు గురువారం జరుగనున్న టిఆర్‌ఎస్ శాసనసభా పక్షం సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం శాసనసభాపక్షం సమావేశం జరుగనుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల అనంతరం జరుగనున్న శీతాకాల సమావేశాలలో ప్రధానంగా విపక్షాలు రైతుల రుణ మాఫీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలను ప్రస్తావించనున్నాయి. అలాగే కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు తదితర అంశాలలో విపక్షాల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నాయి. సభలో విపక్షాలు ప్రస్తావించనున్న విమర్శలను సమర్థవంతంగా ఏ విధంగా ఎదుర్కోవాలి, సభలో ఫ్లోర్ కో-ఆర్డినేషన్ తదితర అంశాలపై అనుసరించే వ్యూహంపై ముఖ్యమంత్రి మార్గదర్శనం చేయనున్నారు.