తెలంగాణ

షీ టీమ్స్ అదుపులో ఏడుగురు ఈవ్ టీజర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతోన్న ఏడుగురిని షీ టీమ్స్ బృందాలు అదుపులోకి తీసుకున్నట్టు షీ టీమ్స్ అధికారిణి, అదనపు పోలీస్ కమిషనర్ స్వాతిలక్రా తెలిపారు. నిందితుల్లో 61 ఏళ్ల ఓ వృద్ధుడు కూడా ఉన్నట్టు ఆమె పేర్కొన్నారు. ఎన్టీఆర్ పార్క్ వద్ద మహిళలను వేధించిన రాజేందర్‌ఫాడ్ (24) శ్రీనివాస్ సోలంకి (18) ప్రవీణ్‌కుంద్ (18)లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా, వీరు పోస్టల్ పరీక్షలు రాయడానికి ఇటీవల నగరానికి వచ్చారు. పరీక్షల అనంతరం వీరు తిరుగు ప్రయాణం సందర్భంగా ఎన్టీఆర్ పార్క్ వద్ద మహిళలను వేధింపుకు గురి చేశారు. దీంతో వారి కుటుంబీకులను పిలిపించి కౌనె్సలింగ్ నిర్వహించారు. అదేవిధంగా దిల్‌సుఖ్‌నగర్ బస్టాప్‌లో బస్సు కోసం వేచివున్న ఓ మహిళను టి ఆంజనేయులు (62) అనే వృద్ధుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. సిసి టివిలో చూసిన షీ టీమ్ అధికారులు అతణ్ని పట్టుకున్నారు. మరో సంఘటన బోజిరెడ్డి కళాశాల వద్ద ముగ్గురు మైనర్లు బైక్‌పై వెళుతూ ఈలలు వేస్తున్నారని బాలికలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిని షీ టీమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని కౌనె్సలింగ్ నిర్వహించారు. మరోసారి బాలికల వైపు కనె్నత్తి చూసినా కేసు పెడతామని హెచ్చరించారు.