తెలంగాణ

జీవ వైవిధ్యాన్ని పరిరక్షిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణలో జీవవైవిధ్య సంరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. అమెరికాలోని మెక్సికోలో గురువారం జరిగిన బయోడైవర్సిటీ అంతర్జాతీయ సదస్సు (కాప్-13) ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తూ జీవవైవిధ్య సంరక్షణలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో నిరంతరం సమగ్ర విశే్లషణలు చేస్తున్నామన్నారు. తెలంగాణలో జీవవైవిధ్యం ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాల్లో 70 ప్రజాజీవ వైవిధ్య రిజిస్టర్లు రూపొందించామన్నారు. జీవ వనరులు వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్న 15 పరిశ్రమలతో న్యాయమైన పంపకంపై తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నదని వివరించారు.
వాణిజ్యపరంగా వినియోగమవుతున్న జీవవనరుల పట్టికలను తయారు చేశామన్నారు. జీవవనరులను ఉపయోగిస్తున్న విత్తన, ఫార్మా, బయోటెట్ రంగాల పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నామన్నారు. రైతులు తరతరాల నుండి కాపాడుకుంటూ వస్తున్న వంగడాలను వారిపేరిట వాటిని రిజిస్టర్ చేస్తున్నామన్నారు. 2020లో ఆదిలాబాద్‌లో వారసత్వ పశుజాతుల క్షేత్రం ఏర్పాటు చేసేందుకు కాప్-11లో తీర్మానం చేశామని రామన్న గుర్తు చేశారు. కాప్-11లో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. జీవవనరుల వినియోగంపై తెలంగాణ రాష్ట్రానికి యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ బయోడైవర్సిటీ 2016 అవార్డు లభించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 33 శాతం హరితాన్ని సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు సభ్యకార్యదర్శి డాక్టర్ సి. సువర్ణ, కేంద్రప్రభుత్వ బోర్డు సహాయ కార్యదర్శి అమితప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల నుండి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.