తెలంగాణ

ఉద్యోగులకు వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: ప్రభుత్వోద్యోగం చేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు పది రోజుల్లో కారుణ్య నియామకాలు చేపట్టాల్సిందిగా సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కారుణ్య నియామకాల విషయంలో అత్యంత మానవత్వంతో వ్యవహరించాలని సిఎం సూచించారు. ఉద్యోగులు, మాజీ సైనికులు, వీర సైనికుల కుటుంబాల సంక్షేమంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, టిఎన్‌జివో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడు దేవిప్రసాద్, ప్రధాన కార్యదర్శి రాజేందర్‌తో ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా తీసుకున్న పలు కీలక నిర్ణయాలను సిఎం కెసిఆర్ మీడియాకు వెల్లడించారు. చనిపోయిన ఉద్యోగి కుటుంబం ఎంతో బాధతో, కష్టంతో ఉంటుందని అలాంటి వారిని ఉద్యోగ నియామకం కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం భావ్యం కాదన్నారు. కారుణ్య నియామకాలకు అర్హులైన వారికి పది రోజులలో నియామక ఉత్తర్వులు అందించాలని సిఎం ఆదేశించారు. వయసు, విద్యార్హతల విషయంలో మినహాయింపులిచ్చే విషయంలో అవసరమైతే కలెక్టర్లకు అధికారాలు బదలాయించాలని ఆదేశించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చివరి రోజున పూర్తి పెన్షన్ అందించి ప్రభుత్వ వాహనంలో ఇంటివద్ద దిగబెట్టాలని ఆదేశించారు. మూడు, నాలుగు దశాబ్దాలపాటు ప్రభుత్వానికి, ప్రజలకు సేవలు అందించిన ఉద్యోగుల పట్ల అత్యంత మర్యాదగా, గౌరవంగా ప్రవర్తించాలని సిఎం అన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకే ప్రాంతంలో పనిచేసేలా అవసరమైన బదిలీలు చేయాలని సిఎం ఆదేశించారు. అన్ని శాఖల్లో ఇదే విధానం అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో జోనల్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇక రాష్ట్ర, జిల్లాస్థాయి క్యాడర్లు మాత్రమే ఉంటాయని సిఎం చెప్పారు. ఈ నేపథ్యంలో అవసరమైన సర్వీసు నిబంధనలు, విధి విధానాలు రూపొందించడానికి ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు సమావేశం కావాల్సిందిగా సిఎం ఆదేశించారు.
సైన్యంలో పని చేసి రిటైరైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో మరో ఉద్యోగం చేసిన వారికి డబుల్ పెన్షన్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. సైన్యంలో పని చేసి రిటైరైన తర్వాత మరో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన వారికి ఒకే పెన్షన్ పొందే అవకాశం ఉందని సిఎం అన్నారు. అలాకాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ సైనిక ఉద్యోగులుగా పని చేస్తే, వారికి మిలటరీ నుంచి వచ్చే పెన్షన్‌తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం విధిగా పెన్షన్ ఇస్తుందని సిఎం కెసిఆర్ ప్రకటించారు. వీర సైనికులకు (అమరులైన) ఇచ్చే రూ. 3 వేల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. సైనికులు నిర్మించుకున్న నివాసాలకు ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వాలని కూడా సిఎం నిర్ణయించారు. నివాస భవనం సైనికుని పేరు మీద ఉన్నా, భార్య పేరు మీద ఉన్న ఈ వెసులుబాటు లభించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న 18మంది ఆడ్‌హాక్ ఉపాధ్యాయుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
త్రిసభ్య కమిటీ
ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ నివాస గృహాల కేటాయింపు, వినియోగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించడానికి తిస్రభ్య కమిటీని సిఎం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సలహాదారు జి వివేకానంద, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి కమిటీలో సభ్యులుగా ఉంటారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేస్తే వారితో ఈ కమిటీ చర్చిస్తుందన్నారు. గవర్నర్ సమన్వయకర్తగా రెండు రాష్ట్రాల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారని సిఎం పేర్కొన్నారు.

చిత్రం..ఉద్యోగ సంక్షేమ నిర్ణయాలపై ఉన్నత యంత్రాంగంతో చర్చిస్తున్న సిఎం కెసిఆర్