తెలంగాణ

నగదు లేదు.. కాడి కదలదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 24: అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుగా ఉంది ఉమ్మడి జిల్లాలోని కర్షకుల పరిస్థితి. ఖరీఫ్‌లో పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా బ్యాంకుల్లో జమ చేయగా, చెల్లింపుల్లేక అన్నదాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రబీలో వరినారు మడులు దునే్నందుకు కాడి కదలటం లేదు. దీంతో బావుల నిండా నీళ్లున్నా, నిరంతరం త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అవుతున్నా, ఒక్క మడి కూడా దున్నని దుస్థితి ఉమ్మడి జిల్లాలో నెలకొన్నది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు కొరత కారణంగా బ్యాంకుల నుంచి సరిపడా మొత్తాన్ని ఉపసంహరించుకోవటంలో బ్యాంకర్లు పలు ఆంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలో రైతులు ఇటు బ్యాంకుల నుంచి డబ్బులు విడిపించలేక, అటు నారు మళ్లకు నీరు పెట్టలేక రబీ సాగు రంది పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాలో రైతుల నుంచి వరి ధాన్యం ఖరీఫ్ వరిధాన్యం కొనుగోలు చేసేందుకు 242 కేంద్రాలు ఇందిరాక్రాంతి పథం ద్వారా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రూ.238.51కోట్ల విలువచేసే 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 35,852 మంది రైతుల నుంచి సేకరించిన ఈ ధాన్యానికి శుక్రవారం వరకు రూ.202.31 కోట్లు బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిపారు. ఇంకా రూ.36.20కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే, బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణకు బ్యాంకర్లు విధిస్తున్న షరతులవల్ల ఇప్పటివరకు రైతులు కేవలం రూ.50నుంచి రూ.60కోట్ల వరకు మాత్రమే తీసుకోగలిగారు. ఈ మొత్తం వరికోత కూలీలకు కూడా సరిపోకపోవటం, పాత పెట్టుబడులకు చెల్లింపులు చేయకపోవటంతో రబీ సాగుకు అటు దుకాణదారులు, ఇటు కూలీలు సహకరించటం లేదు. బ్యాంకు ఖాతాల్లో నగదు ఉన్నా పొందలేకపోతున్న అన్నదాతలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో నిత్యం బ్యాంకుల ఎదుట పడిగాపులు కాయాల్సిన దుస్థితి రైతన్నకు నెలకొంది. అన్నదాత ఇబ్బందులు తీర్చేందుకు బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా, గ్రామాల్లో మైక్రో ఎటిఎంలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఈ దిశగా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి. నగదు కొరత అన్నదాతను నానా అగచాట్ల పాలు చేస్తుండగా, ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు కేవలం 21శాతం మాత్రమే నారు మడులు సిద్దం చేశారు. ఈ రబీ జిల్లాలో 1.50లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తారని వ్యవసాయాధికారులు అంచనా వేయగా, సంక్రాంతి పండగ నాటికి నాట్లు పూర్తయ్యే అవకాశాలుంటాయని అధికారులు పేర్కొన్నారు. అయితే, అన్నదాతను నగదు కొరత వేధిస్తుండగా కేవలం 31.24 వేల హెక్టార్లలో మాత్రమే నాట్లు వేసినట్లు అధికార వర్గాల సమాచారం. రబీలో విత్తనం మొదలు నాట్లు వేసే వరకు ఎకరాకు రూ.16వేల నుంచి రూ.21వేల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు, బావులు, బోర్లలో నీరు పుష్కలంగా ఉండటంతో ఒక్కో రైతు కనిష్టంగా 3నుంచి 4 ఎకరాల వరకు వరి సాగు చేయడానికి పూనుకున్నాడు. అయితే, పెట్టుబడికి డబ్బుల్లేక బ్యాంకుల్లో ఉన్న మొత్తం సకాలంలో అందక పొలాలు దునే్నందుకు తల్లడిల్లుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రబీలో అన్నదాతను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.