తెలంగాణ

క్రీడల అభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 24 : క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి అవసరమైన సదుపాయాలు కల్పించి క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణం నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో ఐదు రోజుల పాటు సాగనున్న పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 62వ జాతీయస్థాయి కబడ్డీ అండర్-17 చాంపియన్‌షిప్ పోటీలను శనివారం సాయంత్రం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి చేసి బెలూన్లు ఎగురవేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ క్రీడారంగంలో వెనుకబడిందని, స్వరాష్ట్రంలో క్రీడల అభివృద్దికి సిఎం కేసిఆర్ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి వౌలిక సదుపయాల కల్పనతో రాష్ట్ర క్రీడాకారులు రాణించేందుకు ప్రోత్సాహం అందిస్తుందన్నారు. చదువుతో పాటు క్రీడారంగం వైపు కూడా విద్యార్థులను ప్రోత్సహిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో వారు రాణించేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. తల్లిదండ్రులు పిల్లలను కేవలం చదువులవైపే నెట్టడంతో అనేక దుష్పరిణామాలు ఎదుర్కొంటున్నారని, బలవన్మరణాలకు గురవుతున్నారన్నారు. క్రీడల ద్వారానే విద్యార్థుల్లో గెలుపు, ఓటముల క్రీడా స్ఫూర్తి అలవరుతుందని గుర్తు చేశారు. జాతీయ స్ధాయి కబడ్డీ పోటీలు నిర్వహించే అవకాశం మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాకు దక్కడం చారిత్రాత్మకమన్నారు. నిజానికి వరంగల్‌లో జరుగాల్సిన క్రీడలు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరిని ఒప్పించి నల్లగొండలో నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ స్థాయి పోటీలకు అవసరమైన ఏర్పాట్లను సజావుగా చేపట్టిన జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కబడ్డీ క్రీడాకారులు గెలుపోటములకు అతీతంగా ఈ ప్రాంతం జ్ఞాపకాన్ని గుర్తించుకునే విధంగా క్రీడలు నిర్వహించాలన్నారు. ఈ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు 28 రాష్ట్రాలకు చెందిన బాల, బాలికల జట్లు పాల్గొంటున్నాయి. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో సైతం పోటీలు నిర్వహిస్తుండడం విశేషం. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర క్రీడాసాధికారిక సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ పూల రవీందర్, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, డిఆర్‌ఓ ఖీమ్యానాయక్, డిఈఓ చంద్రమోహన్, జిల్లా క్రీడా అధికార సంస్థ చైర్మన్ పుల్లయ్య, కార్యదర్శి మగ్బుల్ ఆహ్మద్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..జ్యోతి ప్రజ్వలనతో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి