తెలంగాణ

తేనెతుట్టె కదిలింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: జోనల్ వ్యవస్థ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రకటన ఉద్యోగ, విద్యార్థి సంఘాలతోపాటు రాజకీయ పార్టీల్లో అలజడి సృష్టిస్తోంది. ‘రాష్ట్రంలో ఇక రెండే రెండు కేడర్లు... జిల్లా, స్టేట్ కేడర్లు మాత్రమే ఉంటాయ’ని ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రకటనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వాస్తవానికి జోనల్ వ్యవస్థ ఇంతవరకు రద్దు కాలేదు. దీనిని రద్దు చేసే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఒకవేళ రద్దు చేయాలనుకుంటే ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దానిని ఆమోదించిన తర్వాత రాష్టప్రతి ఆమోదిస్తేనే రద్దు అవుతుంది. ఈ ప్రక్రియ ఇంతవరకు జరగలేదు. పైగా 371-డికి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. కెసిఆర్ పేర్కొన్నట్లుగా జోనల్ వ్యవస్థ రద్దు నిర్ణయం రాష్ట్రప్రభుత్వం చేతుల్లో లేదు. జిల్లాల పునర్విభజన జరిగినందు వల్ల కొత్తగా అవతరించిన 21 జిల్లాలను చేర్చాలంటే ఇప్పటికే ఐదారు జోన్లకు ఉన్న రాష్టప్రతి ఉత్తర్వులను సవరణ చేస్తే సరిపోతుంది. కాని జోనల్ వ్యవస్థను రద్దుచేసే అధికారం రాష్టప్రతికి కూడా లేదు. రాజ్యాంగ సవరణతో ముడిపడి ఉన్న అంశమిది. జోనల్ వ్యవస్థకు లోబడే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. జోనల్ రద్దుకు తాజాగా మరో సమస్య కూడా ఎదురు కాబోతోంది. ఇటీవల రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో జిల్లా కేడర్ నిర్ధారణకు కొత్త జిల్లాల పేర్లను కూడా రాష్టప్రతి ఉత్తర్వులలో చేర్చాల్సి ఉంది. రాష్టప్రతి ఉత్తర్వులలో 10 జిల్లాల పేర్లు మాత్రమే పేర్కొని ఉండగా వాటితోపాటు కొత్తగా 21 జిల్లాల పేర్లను చేర్చాల్సి ఉంది. గతంలో ఉన్న పది జిల్లాల స్థానంలో కొత్త జిల్లాల పేర్లు చేర్చాలంటే అది రాష్టప్రతి ఉత్తర్వుల సవరణల వల్లనే సాధ్యం అవుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జోనల్ వ్యవస్థను రద్దు చేయడంవల్ల రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలైన మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాద్ వంటి జిల్లాలతోపాటు గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని కొన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. జోనల్ వ్యవస్థ రద్దుపై మంత్రివర్గ ఉప సంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిపిన అభిప్రాయ సేకరణలో కొన్ని సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రతిభలో గ్రామీణ ప్రాంత విద్యార్థుల కంటే పట్టణ ప్రాంతాల అభ్యర్థులు సహజంగా ముందుంటారని, పైగా పట్టణ ప్రాంతాల్లోని కోచ్ సెంటర్లలో వారికి శిక్షణ పొందే అవకాశం ఉండటంతో ఉద్యోగాల భర్తీలో గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల అభ్యర్థులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని రాజకీయ పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జోనల్ వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించే పార్టీలను, మేధావి వర్గాలను ఒక వేదికపైకి తీసుకొచ్చి ఆందోళన చేయడానికి కొన్ని ప్రజా సంఘాలు సమాయత్తం అవుతున్నాయి.