తెలంగాణ

డబ్బు కోసమే కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్ కృష్ణా బీమా సమృద్ధి ప్రాంతీయ బ్యాంక్ (కెబిఎస్) సిఇవో మన్మథ్ దలైపై జరిగిన కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఆదివారం నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తన కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. నెల్లూరు జిల్లా తడ గ్రామానికి చెందిన అబ్దుల్ రహీం, హైదరాబాద్‌కు చెందిన నరేష్, రాజేందర్, వెంకటరత్నంలను నిందితులుగా గుర్తించినట్టు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. నిందితులు టీ షాపు నడుపుకుంటూ జీవనం సాగించేవారని, డబ్బుకు ఆశపడి ఈ దురాగతానికి ఒడిగట్టారని ఆయన చెప్పారు. బ్యాంక్ సిఇవో వద్ద డబ్బు భారీగా ఉంటుందని భావించి దోపిడీకి యత్నించారు. కానీ ఆయన వద్ద డబ్బు లేదని నిర్ధారణకు వచ్చి కాల్పులు జరిపి పారిపోయారు. మన్మథ్ రాకపోకలపై సమాచారాన్ని ఆయన డ్రైవర్ వెంకటరత్నం ఎప్పటికప్పుడు నిందితులకు చేరవేసేవాడని సిపి తెలిపారు. మన్మథ్‌పై దాడి చేసేందుకు బిహార్‌లో ఒక దేశవాళి తుపాకీని కూడా నిందితులు కొనుగోలు చేశారు. పథకం ప్రకారం బ్యాంక్ సిఇవో ఇంటికి వెళ్లి డబ్బు కోసం బెదిరించారు. తన వద్ద డబ్బు లేదనడంతో కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కాల్పుల్లో మన్మథ్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. నూతన టెక్నాలజీతో కేసును ఛేదించామని, ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి దేశవాళీ తుపాకీ, 12 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు వెంకటరత్నం కోసం గాలిస్తున్నట్టు కమిషనర్ మహేందర్‌రెడ్డి వివరించారు.

చిత్రం..కాల్పుల ఘటనను మీడియాకు వివరిస్తున్న నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి