తెలంగాణ

ఉద్యమ పథంలో టి.జాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: ప్రజాసమస్యలపై కోదండరామ్ నేతృత్వంలో టి జాక్ ఉద్యమం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈవిషయాన్ని టి జాక్ చైర్మన్ కోదండరామ్ స్వయంగా ప్రకటించారు. టిజాక్ స్టీరింగ్ కమిటీ సమావేశం హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో ఆదివారం జరిగింది. సమావేశం తర్వాత మీడియా ప్రతినిధులతో కోదండరామ్ మాట్లాడుతూ, టిజాక్ భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో సవివరంగా చర్చించామన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 29న హైదరాబాద్‌లో ధర్నా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అనేక పోరాటాల ఫలితంగా 2013 భూసేకరణ చట్టం వచ్చిందని, ఈ చట్టానికి తూట్లు పొడిచే విధంగా ప్రభుత్వం తలపెట్టిన సవరణ బిల్లు ఉందన్నారు. ఈ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శాస్ర్తియ అధ్యయనం లేకుండా చేపట్టిన సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టుల వల్ల వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులపై సవివరంగా సమీక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయినా కాంట్రాక్ట్, ఒప్పంద కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించకపోవడం శోచనీయమన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వంలో సిటిజన్ చార్టర్ ఆఫ్ రైట్స్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో కొనసాగుతున్న జోనల్ వ్యవస్థను ఏకపక్షంగా రద్దు చేయాలన్న నిర్ణయం సరైనది కాదన్నారు. దీనిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించి తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లకు చెల్లించాల్సిన తొమ్మిది నెలల పిఆర్‌సి బకాయిలను, పింఛనర్లకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 70 ఏళ్లవయస్సు దాటిన పింఛనర్లకు పూర్తిపింఛన్ పునరుద్ధరించాలన్నారు. సకలజనుల సమ్మెలో పాల్గొని రిటైర్ అయిన ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ వర్తింప చేయాలన్నారు. ఉద్యోగులకు పాత పింఛన్ విధానానే్న పునరుద్ధరించాలని కోరారు. ఉన్నత విద్యను కార్పోరేటీకరించవద్దని, ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే చేయాలన్నారు.
తెలంగాణలో 2014 నుండి ఇప్పటివరకు 2500 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, సేద్యం రంగంలో సంక్షోభానికి ఇది ఉదాహరణగా నిలుస్తోందన్నారు. రుణమాఫీ మొత్తాన్ని ఒకేపర్యాయం చెల్లించాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల్లో సీమాంధ్ర కాంట్రాక్టర్లు లేకుండా చూడాలన్నారు. మూతపడ్డ చిన్న పరిశ్రమలను పునరుద్ధరించేలా చూడాలన్నారు. కులవృత్తులకు కాపాడేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లో జరిగిన టి.జాక్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కోదండరామ్