తెలంగాణ

టిజెఎసి రాష్ట్ర కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజాక్) రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. చైర్మన్‌గా ప్రొఫెసర్ ఎం.కోదండరాం, కో-చైర్మన్లుగా నల్లపు ప్రహ్లాద్, ఖాజామొహియుద్దీన్, ఇటిక్యాల పురుషోత్తం, కన్వీనర్లుగా పిట్టల రవీందర్, కె.రఘు, కో-కన్వీనర్లుగా బొట్ల భిక్షపతి, డిపి రెడ్డి, వి. సంధ్య, డాక్టర్ జి. శంకర్, బైరి రమేష్, తన్వీర్ సుల్తానా ఎన్నికయ్యారు. అధికార ప్రతినిధులుగా జి. వెంకట్‌రెడ్డి, గురిజాల రవీందర్‌రావు, స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ప్రభాకర్‌రెడ్డి, విఎస్ మల్లికార్జున్, ముత్తయ్య, దేశపాక శ్రీనివాస్, విజేందర్‌రెడ్డి, రామగిరి ప్రకాశ్ ఎన్నికయ్యారు. టిజాక్‌కు అనుబంధంగా ఎడిటోరియల్ కమిటీ, నిర్మాణ కమిటీ,ఫైనాన్స్ కమిటీ, పబ్లిసిటీ కమిటీలను ఏర్పాటు చేశారు.
టిజాక్ సభ్యులకు ‘పంచశీల’
టిజాక్ సభ్యులు పాటించేందుకు ఐదు నియమాలను రూపొందించారు. స్టీరింగ్ కమిటీలో ఈ నియమాలను రూపొందిస్తూ, ‘పంచశీల’గా వీటిని అభివర్ణించారు.
1. కుల, మత, లింగ, హోదా, ప్రాంత, స్థితి వ్యత్యాసాలను పాటించరాదు. తోటి వారిని గౌరవించాలి. 2. సభ్యులు ఒకరిపై మరొకరు చులకనగా మాట్లాడకూడదు. 3. సభ్యుల మధ్య వివిధ అంశాలపై తలెత్తే విబేధాలను సామరస్యపూర్వకంగా చర్చించి పరిష్కరించుకోవాలి. 4. నిధుల వసూళ్ల విషయంలో జవాబుదారీతనం, పారదర్శక పద్ధతులను పాటించాలి. 5. సభ్యులు మధ్యపానానికి దూరంగా ఉండాలి.