తెలంగాణ

ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చేందుకే ప్రధాని మోదీ నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకోవలసివచ్చిందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. నల్లధనాన్ని నిర్మూలించేందుకు పెద్దనోట్ల రద్దు ఎంతగానో దోహదపడుతోందన్నారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘సద్గుణ బాల భారతీయ’ బాలల సుగుణాల పక్షపత్రిక సంపాదకుడు డిఆర్‌ఎస్ నరేంద్ర అధ్యక్షతన ‘పెద్దనోట్ల రద్దు-దేశ ప్రగతికి మెట్లు’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన దత్తాత్రేయ మాట్లాడుతూ, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. దేశ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సుపరిపాలన అందించాలనే లక్ష్యంతోనే పెద్దనోట్లను రద్దు చేసినట్టు వివరించారు. ఎటియంలు, బ్యాంక్‌ల వద్ద కోట్లాది మంది గంటల తరబడి నిరీక్షించారే తప్ప మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు.