తెలంగాణ

ప్రగతి పట్టాలెక్కింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26:ఇబ్రహీంపట్నంలో ఏరోస్పేస్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. టిఎస్-ఐపాస్‌పై శాసన సభలో సోమవారం లఘు చర్చ జరిగింది. దీనికి సమాధానం ఇస్తూ మంత్రి రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి జరుగుతున్న కృషిని వివరించారు. ఆదిభట్ల, శంషాబాద్‌లలో రెండు ఏరోస్పేస్‌లు ఉన్నాయని, మరొకటి ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. యుద్ధరంగానికి అవసరం అయిన పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గించి దేశీయంగా ఉత్పత్తి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నందున తెలంగాణలో ఏరోస్పేస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఐటితోపాటు సైనిక రంగానికి అవసరం అయిన పరికరాలను ఉత్పత్తి చేయడంలోనూ బెంగళూరు, హైదరాబాద్‌ల మధ్య పోటీ ఉందని తెలిపారు. హైదరాబాద్- వరంగల్ కారిడార్‌లో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయనున్నట్టు చెప్పారు. రూరల్ టెక్నాలజీ పాలసీ ద్వారా జిల్లాల్లో సైతం ఐటి కంపెనీల సేవలకు ప్రోత్సాహం అందిస్తున్నట్టు చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించేందుకు అమెరికా, యూరప్ సౌత్ ఈస్ట్ దేశాల్లో మొత్తం ఆరు చోట్ల ఇనె్వస్ట్ తెలంగాణ పేరిట కేంద్రాలను ప్రారంభించనున్నట్టు చెప్పారు. డ్రై పోర్టు ఏర్పాటుకు నివేదిక అందిందని చెప్పారు. భువనగిరి, జడ్చర్ల, జహీరాబాద్, ఆర్మూర్ వంటి కొన్ని ప్రాంతాలను సూచించారని, అన్ని కోణాల్లో పరిశీలించి వీటిలో అనువైన ప్రాంతాన్ని గుర్తించి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్టు చెప్పారు. నోట్ల రద్దు ప్రభావం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలపైనే ఎక్కువగా ఉందని, భారీ పరిశ్రమలపై అంతగా లేదని అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కెటిఆర్ చెప్పారు. టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసేందుకు ఒక సంస్థ ముందుకు వచ్చిందని, నోట్ల రద్దుతో వాళ్లు నిర్ణయం వాయిదా వేసుకున్నారని తెలిపారు. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని, 20కి పైగా చిన్న యూనిట్స్ ఇబ్బందుల్లో పడ్డాయని చెప్పారు. చిన్న పరిశ్రమలు వందలాది మూత పడ్డాయి అనే ప్రచారంలో వాస్తవం లేదని, ఒక నెల ఈఎంఐ కట్టకపోతే సిక్ యూనిట్‌గా బ్యాంకులు నిర్థారిస్తున్నాయని, ఈ నిబంధన మార్చుకోవాలని ఆర్‌బిఐని కోరినట్టు కెటిఆర్ తెలిపారు. ఈజీ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో మొదటి స్థానం లభించినట్టు ప్రచారం చేసుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శపై కెటిఆర్ స్పందిస్తూ పరిశ్రమల శాఖ మంత్రిగా అది తన డ్యూటీ అని కెటిఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు మంచి అవకాశాలు ఉన్నాయి, మేం మొదటి స్థానంలో నిలిచాం అని ప్రచారం చేసుకోకపోతే తప్పు కానీ ప్రచారం చేస్తే తప్పేమిటని అడిగారు.
టిఎస్‌ఐపాస్ చట్టాన్ని ప్రధానమంత్రి స్వయంగా అధికారిక సమావేశంలో అభినందించారని, ఇతర రాష్ట్రాలు అనుసరించాలని సూచించారని కెటిఆర్ తెలిపారు. లైసెన్స్, పర్మిట్ రాజ్ వ్యవస్థలో టిఎస్ ఐపాస్ విప్లవాత్మకమైన మార్పు అని కెటిఆర్ తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలో తమ కేంద్రాలు ఉన్న 28 దేశాల్లో పరిస్థితులు గమనించిన తరువాతనే గూగుల్ కంపెనీ హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుందని అన్నారు. 12వేల ఎకరాల్లో హైదరాబాద్‌లో ఫార్మాసిటీ రూపుదిద్దుకుంటోందని చెప్పారు. వరంగల్‌లో 2 వేల ఎకరాల్లో టెక్స్‌టైల్ సిటీ ప్రారంభించనున్నట్టు చెప్పారు. వరంగల్‌లో టెక్స్‌టైల్ విశ్వవిద్యాలయాన్ని సైతం ప్రారంభించనున్నట్టు కెటిఆర్ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా మరో ఐటి పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
మైక్రోమ్యాక్స్ సెల్ ఫోన్ల సంస్థ పరిశ్రమను మూసివేయనుందని కాంగ్రెస్ నాయకులు చెప్పిన విషయం వాస్తవం కాదని కెటిఆర్ తెలిపారు. వాస్తవానికి మైక్రో మ్యాక్స్ రాష్ట్రంలో విస్తరిస్తోందని చెప్పారు. చైనాలోని ఆర్ అండ్‌డి యూనిట్‌ను మన రాష్ట్రానికి తరలిస్తోందని, ఉత్పత్తిని మూడు రేట్లు పెంచుతోందని తెలిపారు.