తెలంగాణ

బాబోయ్ రెబెల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: వరుస విజయాలతో ఊపు మీదున్న టిఆర్‌ఎస్‌కు వరంగల్ గ్రేటర్‌లో రెబెల్స్ గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 20 డివిజన్లలో రెబెల్స్ పోటీలో ఉండగా ఇప్పటికే కొంతమంది మంత్రుల ఒత్తిడి మేరకు పోటీ నుండి తప్పుకున్నా మరికొన్ని డివిజన్లలో మాత్రం పోటీ నుండి తప్పుకునేందుకు ససేమిరా అంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి చేసినా తప్పుకునేది లేదని కరాఖండిగా చెప్పడంతో మొత్తం 35 మంది రెబల్ అభ్యర్థులు, వారికి సహకరిస్తున్న నాయకులను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ఒకవేళ రెబెల్స్ గెలిచినా వారిని పార్టీలోకి తీసుకోబోమని కూడా పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ప్రధానంగా మేయర్ అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్న నన్నపనేని నరేంద్ర (19వ డివిజన్), దాస్యం విజయభాస్కర్ (51వ డివిజన్)లు పోటీ చేస్తున్న డివిజన్‌లలోనే రెబెల్స్ బెడద ఎక్కువగా ఉంది. ఇద్దరు అభ్యర్థులూ ఒకరిపై ఒకరు రెబెల్స్‌ను ఉసిగొల్పారన్న ప్రచారమూ జరుగుతోంది. గ్రేటర్ పోరులో రెబెల్స్‌కూ, అసలు అభ్యర్థులకు మధ్యే పోటీ అని ఇప్పటికే డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మంత్రి హరీశ్‌రావు పలుమార్లు చెప్పుకొచ్చారు. రెబెల్ అభ్యర్థులు కూడా అసలు అభ్యర్థులకు ధీటుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు అరడజను డివిజన్లలో రెబెల్స్ గెలవనున్నట్టు ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి కూడా.

చిత్రం... టిఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థి గంటా రవికుమార్ ప్రచారం