తెలంగాణ

కృష్ణా జలాల కోసం లొల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 28: కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలోని చివరి ఆయకట్టు రైతులు తమకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. బుధవారం బిజెపి ఆధ్వర్యంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం చివరి ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతులతో కలిసి కల్వకుర్తి నుండి అసెంబ్లీ వరకు పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా కల్వకుర్తి నుండి ప్రారంభమైన పాదయాత్ర వెల్దండ మండలానికి చేరుకోగానే పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఓ దశలో పోలీసులపైకి రైతులు తిరగబడ్డారు. మరోపక్క బిజెపి నాయకులు, కార్యకర్తలు సైతం తమ పాదయాత్రను ముందుకు కొనసాగించారు. దాంతో హైదరాబాద్ - శ్రీశైలం రహదారిపై తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారిని పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేశారు. అరెస్టుకు నిరసనగా వివిధ గ్రామాల రైతులు రోడ్లపైకి వచ్చి రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరును బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి ఎండగట్టారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అనేది కల్వకుర్తి ప్రాంత రైతాంగానికి సాగునీరు అందేలా ఉండాలని అలా కాకుండా పేరుమాత్రం కల్వకుర్తి అయితే సాగునీరు పారేది మాత్రం వనపర్తి ప్రాంతానికేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేవరకు ఉద్యమం ఆగదని వారు స్పష్టం చేశారు. అయితే కల్వకుర్తి ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా భారీగా పోలీసు బలగాలను దింపారు.