తెలంగాణ

ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లను పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. ఈ వర్గాలకు రిజర్వేషన్లను పెంచడానికి అవసరమైన రాజ్యాంగ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో (ప్రగతి భవన్) బుధవారం బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డితో ముఖ్యమంత్రి చర్చించారు. ముస్లింలు, గిరిజనుల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అందినప్పుడే వారి జీవితాలలో మార్పు వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. దీనికోసం ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల కోటాను త్రికరణశుద్ధితో పెంచాల్సి ఉందన్నారు. న్యాయ వివాదాలలో చిక్కుకోకుండా, ఎవరూ ప్రశ్నించలేని విధంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. తమిళనాడు మాదిరిగా రాష్ట్రంలో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచడానికి శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపుదాం, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ రాష్ట్రంలోని ముస్లింలు, గిరిజనులను చేర్చాలని కేంద్రంపై వత్తిడి తీసుకోద్దామని ముఖ్యమంత్రి సూచించారు. తమిళనాడులో ఎక్కువ శాతం రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేస్తున్నారో అధ్యయనం చేయడానికి అధికారుల బృందం వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రాష్టప్రతిని కలవనున్న కాంగ్రెస్ నేతలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 28: రాష్ట్రప్రభుత్వం భూసేకరణ చట్టం 2013కు సవరణలు చేయడాన్ని నిరసిస్తూ రాష్టప్రతి, గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలనే ప్రతిపాదనను తెలంగాణ కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నారు. అసెంబ్లీలో ఈ బిల్లుపై తమకు మాట్లాడేందుకు స్పీకర్ తగిన అవకాశం ఇవ్వలేదని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గురువారం సిఎల్‌పి కార్యాలయంలో సమావేశమై ఒక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి తెలిపారు.

15 బిల్లులకు కౌన్సిల్ ఆమోదం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 28: ప్రభుత్వం ప్రతిపాదించిన 15బిల్లులకు శాసనమండలి బుధవారం ఆమోదం తెలిపింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను బుధవారం శాసనమండలికి ప్రభుత్వం సమర్పించింది. జిల్లాల ఏర్పాటు సవరణ బిల్లు, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, సిద్ధిపేట, ఖమ్మం కమిషనరేట్లను ఏర్పాటు చేసే బిల్లులు, శ్రీవేంకటేశ్వర వర్శిటీ స్థానంలో పివి పశువైద్య విశ్వవిద్యాలయం పేరుతో వర్సిటీ ఏర్పాటు చేసే సవరణ బిల్లు, బిసి కమిషన్ చైర్మన్‌గా హైకోర్టు జడ్జి (రిటైర్డ్) స్థానంలో సామాజిక శాస్తవ్రేత్త/సామాజిక సంస్కర్తను చైర్మన్‌గా నియమించేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లు, ఎపి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో ఉన్న కేసులన్నింటినీ హైకోర్టుకు బదిలీ చేసేందుకు సంబంధించిన బిల్లు, వ్యాట్‌కు సవరణలు చేసేందుకు సంబంధించిన రెండు బిల్లులు, జిహెచ్‌ఎంసి బిల్లుతో పాటు ఇతర బిల్లులను ఆమోదించింది.