తెలంగాణ

ఎన్ని రోజులైనా సరే.. అసెంబ్లీ నిర్వహిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28:అసెంబ్లీ సమావేశాలను అవసరమైన పక్షంలో జనవరి రెండోవారం వరకు కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలతో అన్నారు. రెండున్నరేళ్లలో మనం సాధించిన అభివృద్ధిని వివరించడానికి అవకాశం తీసుకుని ఎన్ని రోజులైనా సభ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలను 20రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్‌తో పాటు ఇతరపార్టీలు డిమాండ్ చేయగా, 25రోజుల పాటు నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు సిఎం ఈనెల 15న జరిగిన బిఎసి సమావేశంలో ప్రకటించారు. ప్రధానమైన అంశాలన్నీ పూర్తయ్యాయి, అయితే ఇచ్చిన మాట ప్రకారం జనవరి మొదటి వారంలో కూడా సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ కోరుతోంది. మొదటి వారం కాదు రెండో వారం వరకూ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు సిఎం తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, భూ సేకరణ చట్టం వంటి కీలక అంశాలు అన్నీ సమావేశంలో చర్చ చర్చించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పథకం, భూ సేకరణ ఈ రెండూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అంశాలు అనే అభిప్రాయం ఉంది. చివరకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకంలో ప్రతిపక్ష నేత సైతం ముఖ్యమంత్రిని అభినందించే విధంగా ఆ అంశంపై చర్చ జరిగింది. నినాదాల మధ్యనే భూ సేకరణ బిల్లు ఆమోదం పొందారు. ఇక అధికార పక్షాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టే అంశాలు ఏమీ లేవు. సమావేశాలను మరిన్ని రోజులు నిర్వహించడం ద్వారా అభివృద్ధి అంశాలను వివరించడానికి ఆవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

థియేటర్ల రేట్ల ఖరారుపై కమిటీల ఏర్పాటు
రెండు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 28: సినిమా థియేటర్లలో వివిధ తరగతులు టిక్కెట్ల రేట్లను నిర్ధారించే విషయమై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల హోంశాఖ ముఖ్య కార్యదర్శులు సమావేశమై విధి విధానాలను ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం 2013లో జారీ చేసిన జీవో వల్ల థియేటర్లకు నష్టం వస్తుందంటూ సినిమా థియేటర్ల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఎలంగో విచారించి పై ఆదేశాలు జారీ చేశారు. రెండు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులు కమిటీలను ఏర్పాటు చేసి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లను ఇందులో సభ్యులుగా నియమించాలన్నారు. సినిమా ప్రేక్షకుల సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకుని సినిమా టిక్కెట్ల రేట్లను నిర్ణయించాలన్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, అందరి సమస్యలను పరిగణనలోకి తీసుకుని చట్టానికి లోబడి విధి విధానాలను ఖరారు చేయాలని కోర్టు ఆదేశించింది.

‘జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 28: హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇస్తామని ప్రభుత్వం తరపున రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ మంత్రి పట్లోళ్ల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. శాసనమండలిలో గృహనిర్మాణానికి సంబంధించి బుధవారం జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ, రాజధానిలో పనిచేస్తున్న వారికి ఇల్లస్థలాలు ఇవ్వడంతో పాటు, జిల్లాల్లో పనిచేస్తున్న మఫిసిల్ జర్నలిస్టులకు డబల్‌బెడ్‌రూం ఇళ్లను కేటాయిస్తామన్నారు. సంవత్సరానికి రెండు లక్షల రూపాయలలోగా ఆదాయం ఉన్న గ్రామీణ జర్నలిస్టులకు డబల్‌బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు జరుగుతుందన్నారు. తొలుత ప్రధాన ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ, రాజధానిలో పనిచేస్తున్న దాదాపు 1100మంది జర్నలిస్టులు ఒక్కొక్కరు రెండు లక్షల రూపాయలు చెల్లించారని తెలిపారు. గతంలో జర్నలిస్టులకు హైదరాబాద్‌లోని రెండు చోట్ల ఇళ్లస్థలాలు ఇచ్చారని, ఆ తర్వాత పేట్‌బషీరాబాద్, నిజాంపేటలలో దాదాపు 72ఎకరాల భూమిని కేటాయిస్తూ జీఓ జారీ చేశారని గుర్తు చేశారు. జర్నలిస్టులు సామాజిక సేవలో నిమగ్నమై ఉండటం వల్ల వారి సంక్షేమం కోసం కనీసం ఇళ్లస్థలాలనైనా ఇవ్వాల్సి ఉందన్నారు.