తెలంగాణ

కల్తీకి పాల్పడితే ఉరితీయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28: రాష్ట్ర ప్రజలకు నిత్యావసర సరుకుల విషయంలో ఏలాంటి మోసాలు జరుగకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శాసన మండలిలో బుధవారం స్పష్టం చేశారు. కల్తీని అరికట్టేందుకు త్వరలో సిఎం సమక్షంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, కల్తీకి పాల్పడుతున్న వారు ఎంతటి వారైన వారిని వదిలేదిలేదని మంత్రి తెలిపారు. కల్తీ కారంపొడితో పాటు నిత్యావసర సరుకులు అన్నీ కల్తీమయమయ్యాయని, వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని ఆధికార, విపక్ష పార్టీలు పట్టుబట్టాయి. దీంతో మంత్రి సమాధానమిస్తూ కారంపొడిని కల్తీ చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఖమ్మం జిల్లాలో 15 మంది ఉత్పత్తిదారులను అరెస్టు చేసి, వరంగల్ జిల్లాలో 23మందిపై కేసులు నమోదు చేశామన్నారు. నిత్యావసర సరుకులను కల్తీ వ్యవహారం దాదాపు రూ.వంద కోట్ల కుంభకోణమని, ఈ విషయంలో ప్రభుత్వం విజిలెన్స్‌ను పటిష్టం చేయాలని నిందితులు ఎంతటి వారైనా వదలవద్దని కాంగ్రెస్ పార్టీ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రశ్నోత్తారాల సమయంలో సభ్యులు గాంధీ ఆసుపత్రికి ఆధునిక పరికరాల కొనుగోలు, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ చేపడుతున్న కంప్యూటర్ శిక్షణా కేంద్రాల నిర్వహణ, కొత్త జిల్లాలో నూతన మండలాల ఏర్పాటు, గుడుంబా నియంత్రణ, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ కొరకు బడ్జేట్ కేటాయింపు, కార్పొరేట్ ఆసుపత్రులలో ఆరోగ్య కార్డుల ఆంగీకారం వంటి అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు పద్మారావు, లక్ష్మారెడ్డి, ఈటల సమాదానాలిచ్చారు.