తెలంగాణ

సినిమాల్లో అవకాశమిస్తామని.. మైనర్ బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ నమ్మించి ఓ మైనర్ బాలికపై 17 రోజులపాటు అత్యాచారానికి పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. బంజారాహిల్స్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ఇద్దరు సినీ అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు. సినిమాల్లో డ్యాన్సర్‌గా స్థిరపడాలని ఆశపడ్డ పదిహేనేళ్ల బాలిక బంజారాహిల్స్ రోడ్డు నెం. 2లోని ఇందిరానగర్‌లో నివాసముండే మేనమామ ఇంటికి వచ్చింది. సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌నంటూ చెప్పుకున్న ఇందిరానగర్‌కు చెందిన షేక్ అక్బర్ (21) అతని మిత్రులు తూము వెంకారెడ్డి (22) ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నండూరి పాపారావు అలియాస్ గణేష్ (31) మొయినాబాద్‌కు చెందిన గుడపల్లి నవీన్‌కుమార్ (19)లు బాలికను సినిమాల్లో అవకాశమిస్తామని నమ్మించారు. డిసెంబర్ 3న రంగారెడ్డి జిల్లా నందిగామకు తీసుకెళ్లి, మరో స్నేహితుడు కుమార్ కలసి ఐదుగురు ఆమెను ఇందిరానగర్‌తోపాటు చింతల్, జీడిమెట్ల, నందిగామ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు.