తెలంగాణ

భూసేకరణ బిల్లుకు మండలి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూసేకరణ బిల్లుకు గురువారం శాసన మండలి ఆమోదం తెలిపింది. బిల్లును వ్యతిరేకిస్తూ శాసనమండలి నుండి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. భూసేకరణ, పునరావాసం, పున: పరిష్కారంలో న్యాయమైన పరిహారం, పారదర్శక హక్కు(తెలంగాణ సవరణ)బిల్లు,2016ను నీటిపారుదల మంత్రి టి. హరీష్‌రావు కౌన్సిల్‌లో ప్రతిపాదించారు. ఈ అంశంపై ఒక్కో పార్టీ నుండి ఒక్కొక్కరు మాట్లాడేందుకు చైర్మన్ స్వామిగౌడ్ అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పక్షం నేత షబ్బీర్ అలీ మాట్లాడిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పి. సుధాకర్‌రెడ్డి తదితరులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు కోరగా చైర్మన్ అందుకు తిరస్కరించారు. దాంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్టు షబ్బీర్ అలీ ప్రకటించి, పార్టీ సభ్యులతో పాటు సభ నుండి వెళ్లిపోయారు. కేంద్రం తీసుకువచ్చిన భూసేకరణ చట్టం 2013లో మార్పులు, చేర్పులు చేసేందుకు రాష్ట్రానికి అధికారం లేదంటూ షబ్బీర్ అలీ పేర్కొన్నారు. బిజెపి తరఫున రామచంద్రరావు, టిఆర్‌ఎస్ తరపున పల్లారాజేశ్వర్‌రెడ్డి, ఎంఐఎం తరపున రజ్వి తదితరులు మాట్లాడుతూ, సవరణ బిల్లుకు మద్దతు తెలిపారు. ఆ తర్వాత నీటిపారుదల మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, రైతుకు మేలైన పునరావాసం, పరిహారం కల్పించేందుకే ఈ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు వివరించారు. ఏ ప్రాజెక్టు అయినా భూసేకరణ చేయకుండా చేపట్టలేమని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదని, ప్రాజెక్టులు రాకూడదన్న దుర్బుద్ధితోనే కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆరోపించారు.