తెలంగాణ

వనం వీడి జనంలోకి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్/ మహదేవ్‌పూర్, డిసెంబర్ 30: మావోయిస్టులు గత ఐదు దశాబ్దాలుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉద్యమ కార్యకలాపాలతో సాధించింది ఏమీలేదని, ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి వనం వీడి జనంలో కలవాలని మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన అంతర్ రాష్ట్ర వంతెనను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహారాష్టల్రోని సిరోంచి సమీపంలోని మద్దికుంట వద్ద జరిగిన బహిరంగ సభలో గవర్నర్ మాట్లాడారు. 50 ఏళ్లుగా నక్సలైట్ల చర్యల కారణంగా ఈ రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. మహారాష్టల్రోని గడ్చిరోలి జిల్లాలో 50 ఏళ్లలో జరగని అభివృద్ధి రెండేళ్లలో జరిగిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని సిఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు గవర్నర్ సూచించారు. తెలంగాణలో పుట్టిపెరిగిన తనకు మహారాష్ట్ర కర్మభూమిగా చెబుతూ, ఆ రాష్ట్రంపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. స్వరాష్ట్రం తెలంగాణ, గవర్నర్‌గా ఉన్న మహారాష్టల్ర మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపరిచే వంతెనను తాను ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. అంతర్ రాష్ట్ర బ్రిడ్జి ప్రారంభంతో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, ఉపరితల రవాణా మంత్రి గడ్కరి దేశంలోని రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇస్తూ అధిక నిధులు కేటాయిస్తున్నారని అన్నారు.
కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక రహదారులు, రవాణ రంగంలో ఊహించని అభివృద్ధి జరుగుతోందన్నారు. గత ప్రభుత్వాలు స్వలాభానికే తప్ప ప్రజల సమస్యలు, అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసాయని ఆరోపించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. మహారాష్టల్రోని గడ్చిరోలి జిల్లాలో దట్టమైన అడవుల కారణంగా మావోయిస్టుల ప్రభావంతో అభివృద్ధిలో వెనకబడిందని చెబుతు, ఈ జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని పరిశ్రమలు ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి లభించటంతోపాటు ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. మహారాష్ట్ర- ఛత్తీస్‌గఢ్ మధ్య ఇంద్రావతి, ప్రాణహిత నదులపై బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని, వీటి పనులు త్వరలో పూర్తయితే భూపాలపట్నం నుంచి హైద్రాబాద్, గడ్చిరోలి నుంచి హైద్రాబాద్‌కు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతోపాటు దూరభారం తగ్గుతుందని తెలిపారు.
తెలంగాణతో సానుకూల వైఖరి: ఫడ్నవిస్
సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణతో కలసిమెలసి పనిచేస్తామని, సానుకూల వైఖరితో ముందుకు వెళతామని మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. బహిరంగ సభలో మాట్లాడిన ఫడ్నవిస్, గడ్చిరోలి జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని చెప్పారు. తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో నిర్మిస్తున్న మేడిగడ్డ ప్రాజెక్టుతో గడ్చిరోలి జిల్లాలోని గిరిజన, ఆదివాసులకు మేలు జరుగుతుందని, రైతులకు రెండుపంటలకు నీరంది వ్యవసాయపరంగా గడ్చిరోలి జిల్లా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. నీటిలభ్యత ఆధారంగా గడ్చిరోలి జిల్లాకు ఎత్తిపోతల పథకాలు మంజూరు చేస్తామని ప్రకటించారు. గడ్చిరోలి జిల్లాలో ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనివల్ల ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. కార్యక్రమానకి విశిష్ట అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతు తెలంగాణ, మహారాష్టల్రు ఉమ్మడి కుటుంబ సభ్యులుగా వ్యవహరించాలన్నారు. రహదారుల అభివృద్ధికి నిధుల మంజూరు చేసినందుకు కేంద్రమంత్రి గడ్కరీకి కృతజ్ఞతలు తెలుపుతూ మరిన్ని రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి హన్స్‌రాజ్ గంగారాం, మహారాష్ట్ర మంత్రులు సుధీర్ మురుగంటివార్, అమ్రిష్ పాటిల్, గడ్చిరోలి ఎంపి అశోక్ నేత తదితరులు పాల్గొన్నారు. కొత్త బ్రిడ్జి ప్రారంభోత్సవ నేపథ్యంలో గడ్చిరోలి నుంచి హైద్రాబాద్‌కు కొత్తగా ఏర్పాటుచేసిన బస్సు సర్వీసును ప్రారంభించారు.

చిత్రాలు..కాళేశ్వరం-సిరోంచి మధ్య గోదావరిపై నిర్మించిన బ్రిడ్జి ప్రారంభిస్తున్న మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు.
*గడ్చిరోలి -హైద్రాబాద్ మధ్య కొత్త బస్సు ప్రారంభిస్తున్న మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్. చిత్రంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మంత్రి తుమ్మల తదితరులు.