తెలంగాణ

సామాజిక ఉద్యమంగా హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: హరితహారంను సామాజిక ఉద్యమంగా చేపట్టనున్నట్టు, గ్రామస్థాయి నుంచి రాష్టస్థ్రాయి వరకు ప్రజాప్రతినిధులను ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గురువారం శాసన సభలో హరిత హారంపై లఘు చర్చ జరిగింది. హరిత హారంపై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన చేస్తూ, దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా రాష్ట్రంలో హరితహారాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు. సర్పంచ్ మొదలుకొని ఎమ్మెల్యే వరకు అందరినీ భాగస్వామ్యం చేస్తూ ఉద్యమ స్ఫూర్తితో హరిత తెలంగాణ సాధించాలని పిలుపునిచ్చారు. లఘు చర్చలో వివిధ పక్షాల సభ్యులు చేసిన సూచనలపై ముఖ్యమంత్రి స్పందిస్తూ గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో మొక్కలు నాటడాన్ని తప్పనిసరి చేయనున్నట్టు చెప్పారు. అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవడానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని స్పీకర్‌ను కోరారు. మొక్కల పెంపకంలో ప్రజాప్రతినిధుల బాధ్యత ఎక్కువ అని ఆయన అన్నారు. ‘మన ముందుతరాలు మనకు విజ్ఞానాన్ని అందించాయి, వాటితో సుఖమయ జీవితం గడుపుతున్నాం, అదే విధంగా మనం మన భవిష్యత్తుతరాలకు ఏమిస్తున్నాం అనేది ఆలోచించాల’ని కెసిఆర్ అన్నారు. గతంలో ఒకసారి బీజింగ్‌లో ప్రభుత్వం వాతావరణ కాలుష్యం ఏర్పడడంతో అడవుల నుంచి వేలాది ట్యాంకుల ద్వారా శుద్ధమైన గాలిని బీజింగ్‌కు తీసుకు వచ్చారని, అలాంటి పరిస్థితులు తలెత్తకుండా మొక్కలు పెంచాలని అన్నారు. ఎనిమిది కోట్ల టేకు మొక్కలు ఈసారి పెంచామని, ఈసారి 15కోట్ల టేకు మొక్కలు పంపిణీ కోసం నర్సరీలో పెంచుతున్నట్టు చెప్పారు.
ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో దట్టమైన అడవులు విస్తరించి ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో 26,903 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో అటవీ భూమి ఉందని చెప్పారు. దట్టమైన అటవీ గతంలో 25 శాతం ఉంటే ఇప్పుడది 1.06 శాతానికి పడిపోయిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అటవీ సంరక్షణకు ఏటా14 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్పారు. అడవుల నుంచి ఏటా 50కోట్ల ఆదాయం ఉండేదని, కనీసం ఆ మేరకు కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. మనం ఏటా నాలుగు వందల కోట్ల రూపాయలను అటవీ అభివృద్ధికి, హరిత హారంకు ఖర్చు చేసుకుంటున్నామని కెసిఆర్ చెప్పారు. గత 34ఏళ్లలో తెలంగాణలో నాటిని మొక్కల సంఖ్య 35.3 కోట్ల అని, దీని వల్ల తెలంగాణ భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందని అన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కొంత ప్రాంతం మినహా మిగతా తెలంగాణ అంతటా ఏటా తీవ్ర వర్షాభావం నెలకొందని ముఖ్యమంత్రి తెలిపారు.
ప్రపంచంలో మూడో ప్రయత్నం
పచ్చదనాన్ని పెంచేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన గొప్ప ప్రయత్నాల్లో తెలంగాణలో హరిత హారం మూడవ ప్రయత్నం అని కెసిఆర్ తెలిపారు. చైనాలో గోబీ ఎడారి విస్తరణ నిలుపుదల చేసేందుకు యావత్ ప్రజానీకం 4,500 కిలో మీటర్ల పొడవునా మొక్కలు నాటి గ్రీన్ వాల్ ఆఫ్ చైనాను నిర్మించారని, రెండవ అతి పెద్ద ప్రయత్నం బ్రెజిల్‌లో జరిగిందని అన్నారు. అమెజాన్ నదీ తీరంలో అడవిని పరిరక్షించడం కోసం వన్ బిలియన్ ట్రీస్ ఫర్ అమెజాన్ అనే పేరుతో వంద కోట్ల మొక్కల పెంపకం జరిగిందని చెప్పారు. ఈ రెండు ప్రయత్నాలను మించిన ప్రయత్నం ఇప్పుడు తెలంగాణలో జరుగుతోందని చెప్పారు.
నిజామాబాద్ జిల్లా గిద్ద జిల్లా పరిషత్తు హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించడాని కన్నా ముందే స్కూల్‌ను అడవిలా మార్చారని, పిల్లలకు మొక్కలు పెంచడాన్ని అలవాటుగా మార్చారని ముఖ్యమంత్రి తెలిపారు. సాయిరెడ్డిని శాసన సభాముఖంగా అభినందిస్తున్నట్టు, శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు కెసిఆర్ తెలిపారు. సాయిరెడ్డి లాంటి ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలవాలని విద్యార్థులు మొక్కలు పెంచే విధంగా ప్రోత్సహించాలని కెసిఆర్ సూచించారు. తెలంగాణలో ఎక్కడికక్కడ నాలుగువేల నర్సరీలను అభివృద్ధి పరిచినట్టు, రాష్ట్రంలో సగటున రెండు గ్రామాలకు ఒక నర్సరీ అందుబాటులో ఉందని చెప్పారు.
పట్టా కాదు అటవీ ఉత్పత్తులపై హక్కు
గిరిజన ప్రాంతాల్లో పోడు భూమి పేరుతో కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని, గిరిజన ప్రాంతాల శాసన సభ్యులకు దీనిపై అవగాహన ఉండాలని అన్నారు. గిరిజనులు ఆ ప్రాంతంలోని అటవీ ఉత్పత్తులను సేకరించి జీవనోపాధి పొందే హక్కు కల్పించడం తప్ప అడవిని చదును చేసి పోడు వ్యవసాయం సాగించేందుకు హక్కు లేదని చెప్పారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌లు గతంలో ప్రభుత్వం ఇచ్చింది అటవీ ఉత్పత్తులు సేకరించుకోవడానికి మాత్రమే కానీ వ్యవసాయం కోసం కాదని చెప్పారు.