తెలంగాణ

సిద్దిపేట, పుల్లూరిబండ వద్ద లభించిన ఆదిమానవుడి ఆవశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: రాష్ట్రంలోని సిద్దిపేట, పుల్లూరిబండ ప్రాంతాలలో మెగల్తీక్ కాలం నాటి స్మశాన వాటికలలో లభించిన ఆదిమానవుని ఆవశేషాల డిఎన్‌ఎల పరిశీలించటానికి సిసిఎంబి, దక్కన్ కాలేజిజీ ఆఫ్ పూణేలతో రాష్ట్ర పురావస్తుశాఖ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు 16 ఆవశేషాలను శుక్రవారం వాటికి అప్పగించింది. చారిత్రకంగా, బయేలాజీ మరియు ఆర్కియాలజీశాఖల మధ్య కుదిరిన ఈ ఒప్పందం దేశంలోనే మొట్టమొదటిదని పురావస్తుశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. ఆదిమానవుల ఆవశేషాలను అతి సూక్ష్మంగా పరిశీలించి అప్పటి కాలంలో మానవుల శరీరాకృతి, అలవాట్లు, వయసు, లింగ నిర్ధారణ, బరువులను డిఎన్‌ఎ పరీక్షలో తేలనున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో లభించిన ఆవశేషాల ఆధారంగా ఈ ప్రాంతం ఎంతో పురాతనమైందని ఇప్పటికే నిరూపితం అయిందన్నారు. ఈ ప్రాంత చరిత్రను మరింత లోతుగా తెలుసుకోవడం పట్ల మరింత దృష్టి సారించామన్నారు. సూక్ష్మస్థాయి పరిశీలనలో సిసిఎంబి, దక్కన్ కాలేజీ ఆఫ్ పూణేకు ఎంతో అనుభవం ఉందన్నారు. ఈ ఒప్పందానికి ఐదు సంవత్సరాల వరకు కాలపరిమితి విధించినట్టు వెంకటేశం తెలిపారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా పెద్దమారూర్, నల్లగొండ జిల్లా ఏలేశ్వరం, కర్నాటకలోని రాయిచూర్ వద్ద లభించిన ఆవశేషాల చరిత్రను మరింత లోతుగా తమ శాఖ అధ్యయనం చేస్తుందని తెలిపారు.

చిత్రం..సిసిఎంబి, దక్కన్ కాలేజీ ఆఫ్ పూణేతో
కుదర్చుకున్న ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న పురావస్తుశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం