తెలంగాణ

హైకోర్టు ఆదేశాలతోనే.. క్రమబద్ధీకరణ ఆగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ ప్రక్రియను ఆపాల్సిందిగా హైకోర్టు ఆదేశాల మేరకు నిలిపివేసినట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ప్రక్రియ కొనసాగుతుండగా కొందరు హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. శాసనసభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల వ్యవధిలో సభ్యులు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, బిజెపి సభ్యుడు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, తెదేపా సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య తదితరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఉప ముఖ్యమంత్రి పై వివరణ ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులు క్రమబద్ధీకరించ వద్దని ఉస్మానియా వర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థులు హైకోర్టుకు వెళ్లారని కడియం శ్రీహరి వివరించారు. కేసు విచారణలో ఉందని, తమనుంచి తీర్పు వెలువడే వరకు క్రమబద్ధీకరణ ప్రక్రియ ఆపాలని హైకోర్టు ఆదేశించడంతో నిలిపివేశామన్నారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ ఆగిపోవడంతో అప్పటి వరకు వారికి ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనంలో 50శాతం పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో కాంట్రాక్టు విధానంతో కొనసాగుతున్న 3687 మంది జూనియర్ లెక్చరర్ల వేతనాన్ని
రూ.18 వేలనుంచి 27 వేలకు పెంచినట్టు కడియం శ్రీహరి చెప్పారు. డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలను కూడా వారం, పది రోజుల్లో పెంచబోతున్నట్టు చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలన్నది ఎవరో చేసిన డిమాండ్ మేరకు నిర్ణయం తీసుకోలేదని, అది తమ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీగా కడియం గుర్తు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైకోర్టు అనుమతి తీసుకొని క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా యోచిస్తున్నట్టు చెప్పారు. కాంట్రాక్టు విధానంలో పని చేస్తున్న ఉద్యోగినులకు ఇతర ఉద్యోగినుల మాదిరిగా ప్రసూతి సెలవు ఇవ్వడం సాధ్యం కాదని కడియం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో వౌలిక వసతులు, ఫర్నిచర్, బయోమెట్రిక్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నట్టు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కడియం శ్రీహరి చెప్పారు. కాలేజీలవారీగా అవసరమైన వౌలిక వసతి సౌకర్యాలపై నివేదికలను ఇప్పటికే తెప్పించుకున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం వెల్లడించారు.