తెలంగాణ

పరిశ్రమల భూములపై పునస్సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమి వినియోగించని పక్షంలో తిరిగి స్వాధీనం చేసుకుంటామని పరిశ్రమల మంత్రి కె తారక రామారావు ప్రకటించారు. శాసనసభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల వ్యవధిలో పాలకపక్షానికి చెందిన సభ్యులు చింతా ప్రభాకర్, ఆరూరి రమేష్, గంగుల కమలాకర్, దాస్యం వినయ్ భాస్కర్, సోలిపేట రామలింగారెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి కెటిఆర్ సమాధానమిస్తూ గత ప్రభుత్వాల హయాంలో పరిశ్రమలకు ఇచ్చిన భూముల పందేరాన్ని పున:సమీక్షిస్తామన్నారు. పరిశ్రమల స్థాపనకు కేటాయించిన భూముల్లో యూనిట్ల ఏర్పాటుకు రెండేళ్లు గడువిస్తున్నామని, ఈలోగా స్థాపించకుంటే ప్రభుత్వం భూములను వెనక్కి తీసుకుంటుందని వెల్లడించారు. ఎంఎల్‌ఆర్ కార్ల కంపెనీకి మెదక్ జిల్లాలో 225 ఎకరాలు కేటాయించగా, అన్ని ఎకరాలు అనవసరమని పరిశీలించిన పిమ్మట 125 ఎకరాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. మిగతా వంద ఎకరాల్లో కేవలం 25 ఎకరాల్లోనే ఎంఎల్‌ఆర్ కంపెనీ యూనిట్లు నెలకొల్పిందని మంత్రి వివరించారు. తూప్రాన్ వద్ద హిందుజా కంపెనీకి కేటాయించిన స్థలంలో పరిశ్రమ స్థాపించకపోవడంతో దాన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు మంత్రి వివరించారు. గత ప్రభుత్వాల హయాంలో అవసరానికి మించి పరిశ్రమల స్థాపన పేరిట జరిపిన భూపందేరాలను పున:సమీక్షిస్తామని సభకు మంత్రి హామీ ఇచ్చారు. పరిశ్రమల స్థాపన పేరిట ప్రభుత్వం నుంచి చౌకగా భూములు పొంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు కూడా తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాగే ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో పరిశ్రమల కోసం తీసుకున్న భూమిలో ఎలాంటి పరిశ్రమలు నెలకొల్పలేదని కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ సభ దృష్టికి తెచ్చారు. మిర్యాలగూడ సమీపంలోని నిడమనూరు వద్ద 500 ఎకరాలను పరిశ్రమల స్థాపనకు తీసుకున్న భూమిలో ఎలాంటి పరిశ్రమ నెలకొల్పలేదని, అలాగే అదే సంస్థకు హైదరాబాద్ సోమాజిగూడలో కేటాయించిన స్థలంలో మ్యారేజీ ఫంక్షన్ హాల్ నడుపుతున్నారని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు సభ దృష్టికి తీసుకొచ్చారు. వీటిని వెంటనే పరిశీలించి తప్పకుండా స్వాధీనం చేసుకుంటామని మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు.