తెలంగాణ

జిహెచ్‌ఎంసికి టిఆర్‌ఎస్ ప్రత్యేక మ్యానిఫెస్టో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11:గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం టిఆర్‌ఎస్ ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల చేస్తుందని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. జనవరి మూడవ వారంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతాయని సూచనప్రాయంగా వెల్లడించారు. గ్రేటర్‌లో ఎన్నికల ఫలితాలపై ఐదు రకాల సర్వేలు చేయించామని అన్నింటిలోనూ టిఆర్‌ఎస్ విజయం ఖాయం అని తేలిందని అన్నారు. ఒంటరిగానే మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్‌కు బలం ఉందో లేదో జనవరి చివరి వారంలో మాట్లాడుకోవచ్చునని అన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై అనేక ప్రచారాలు చేశారని, కానీ టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని, ఏ ప్రాంతానికి చెందిన వారైనా స్వేచ్ఛగా వ్యాపార కార్యకలాపాలు చేసుకుంటున్నారని తెలిపారు.