తెలంగాణ

ఆమె 11 కాలేజీల్లో ప్రొఫెసర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: ఒకటి కాదు రెండు కాదు ఆమె ఏకంగా 11 ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రోఫెసర్ బాధ్యతలు నిర్వహిస్తోంది. నిజమా? అని తనిఖీకి వచ్చిన అధికారులు ఫోన్ చేస్తే ఔను అని సమాధానం చెబుతుంది. అలా సమాధానం చెప్పినందుకు ఆమెకు లక్ష రూపాయలు ముట్ట చెబుతారు. ఈ ప్రోఫెసర్ గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా గురువారం శాసన సభలో వెల్లడించారు. ఎలాంటి నాణ్యత లేకుండా కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం కొన్ని కాలేజీలను నడిపిస్తున్నారని, తనిఖీలకు వెళ్లినా పట్టుపడకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెప్పారు. శైలజా రామయ్యర్ సాంకేతిక విద్యా శాఖ కమీషనర్‌గా ఉన్నప్పుడు 11 ఇంజనీరింగ్ కాలేజీల ప్రోఫెసర్ సంగతి బయటపడిందని చెప్పారు. పోనీ హైదరాబాద్‌లోని 11 కాలేజీల్లో పని చేస్తుంటే, ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి కారులో వెళతారు అనుకుంటే అదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు 11 కాలేజీల్లో పని చేస్తున్నట్టు రికార్డుల్లో చూపారని చెప్పారు. జెఎన్‌టియు నుంచి ఫోన్ వస్తౌ ఔను పని చేస్తున్నాను అని చెబితే చాలునని అన్నారు. ఇలాంటి వ్యవహారాలు నడిపేందుకు బ్రోకర్ల వ్యవస్థ ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.