తెలంగాణ

అక్రమాలపై దర్యాప్తు జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: సింగరేణి కాలరీస్‌లో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని బిజెపి నేత జి కిషన్‌రెడ్డి గురువారం శాసనసభలో డిమాండ్ చేశారు. సింగరేణిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన పాల్గొంటూ సింగరేణి గనుల్లో అక్రమాలు జరిగాయని, వస్తువుల కొనుగోలు, ఇసుక తవ్వకాలలో కూడా అవినీతి జరిగిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారులు సిఎస్‌ఆర్ పేరు మీద ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని, కాంట్రాక్టు వర్కర్లకు న్యాయం చేయడం లేదని అన్నారు. మహిళా ఉద్యోగినులకు ప్రసూతి సెలవులు ఇవ్వడం లేదని, విశ్రాంత ఉద్యోగులకు కనీస వేతనాలు చెల్లించాలని అన్నారు. ఓదయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చొరవతో సంస్థ పురోభివృద్ధి దిశగా పయనిస్తోందని అన్నారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో సింగరేణి అధికారులు ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని వాటిలో అనేక లోపాలున్నాయని ఆరోపించారు. ఉత్పాదక వ్యయం పెరిగిందని, ఉత్పత్తి తగ్గిందని, దానిని సరిచేయాలని వెంకటరావు సూచించారు. సింగరేణితో దళితులు భూములు కోల్పోయారని వారికి ఉపాధి చూపాలని సున్నం రాజయ్య కోరారు. సింగరేణి కార్మికులకు వారి బిడ్డలకు మంచి విద్యను అందించేందుకు విద్యాసంస్థలు, వైద్య సంస్థలు నెలకొల్పాలని సభ్యుడు జాఫర్ హుస్సేన్ సూచించారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ గతంలో ప్రమాదాలు జరిగి కార్మికులు మరణిస్తే పరిహారం అడిగినందుకు జైళ్లలో వేశారని ఆరోపించారు. ఎస్ సత్యనారాయణ, కనకయ్య, కోవాలక్ష్మీ, సంద్రవీరయ్య, పి వెంకటేశ్వర్లు తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు.