తెలంగాణ

మోసాలను సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 9: ప్రభుత్వ వసతి గృహాలకు సరుకులు అందించే గుత్తేదారులు అక్రమాలకు పాల్పడితే పిడి యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. అవినీతి రహిత పాలనే ప్రభుత్వ లక్ష్యమని, సరుకులు సరఫరా చేసే గుత్తేదారులపై దృష్టి సారించాలని, ఈ విషయంలో రాజీ ధోరణి అవలంబించవద్దని అధికారులకు సూచించారు. సోమవారం కరీంనగర్ జిల్లాలోని పలు ప్రభుత్వ వసతిగృహాల్లో మంత్రి రాజేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహాల్లో కలియ తిరుగుతూ సమస్యలున్నాయా అంటూ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. హాస్టల్‌లో తయారు చేసిన టిఫిన్‌ను రుచి చూసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాల్లో అన్ని వౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ఇక్కడ ఉండే విద్యార్థులకు కడుపునిండా భోజనం పెట్టాలనే లక్ష్యంతో బిపిటి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం రూ.500 కోట్లకుపైగా ఖర్చు చేస్తోందని తెలిపారు. వసతి గృహాలలో 7వ తరగతి విద్యార్థుల వరకు రూ.750, 10వ తరగతి విద్యార్థులకు రూ.850 ప్రతి నెల చెల్లిస్తుందని, ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై నెలకు రూ.1400 నుంచి రూ.1500 వరకు ఖర్చు చేస్తోందని వివరించారు. విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని, పేదల అభివృద్ధికి కంకణం కట్టుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.

చిత్రం..హాస్టల్‌లో టిఫిన్ రుచి చూస్తున్న ఈటల