తెలంగాణ

24న హైదరాబాద్‌లో టిడిపి బహిరంగ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై నారా లోకేష్ దృష్టి సారించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, పార్టీ శాసనసభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర ముఖ్య నాయకులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టిడిపి బలంగా ఉన్నందున మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటామన్న ధీమాను లోకేష్ వ్యక్తం చేశారు. అయితే పార్టీ నాయకులు వలస వెళ్లకుండా అడ్డుకట్ట వేయాలని ఆయన సూచించారు. నాయకులు పార్టీ ఫిరాయించినా, కార్యకర్తలు వెళ్ళలేదని, పార్టీకి అండగా ఉన్నారని ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన వారికి టిక్కెట్లు ఇస్తామని ఆయన చెప్పారు. ఇలాఉండగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ బిజెపితో కలిసి సమిష్టిగా పని చేయాలని సమావేశంలో పాల్గొన్న నాయకులు నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయాలని వారు భావించారు. ఇందులో భాగంగా ఈ నెల 24న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు. డివిజన్ల వారీగా పార్టీ సీనియర్ నాయకులను ఇన్‌ఛార్జీలుగా నియమించాలని నిర్ణయించారు.
రావుల ధ్వజం
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాల అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరింపజేసి తమ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు టిఆర్‌ఎస్ చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. టిఆర్‌ఎస్ సభ్యులు ఏకగ్రీవం ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో కస్టమ్స్
అప్పిలేట్ ట్రిబ్యునల్ బెంచ్
14నుంచి ప్రారంభం

హైదరాబాద్, డిసెంబర్ 11: కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ప్రాంతీయ బెంచ్ ఈ నెల 14 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. 1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవసరానికి అనుగుణంగా ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది. బెంగళూరు కేంద్రంగా ఈ ట్రిబ్యునల్ ఎపి, తెలంగాణ, పాండిచ్చేరిలో భాగమైన యానాం అవసరాలను తీరుస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా పని చేయనున్న రీజనల్ అప్పీలేట్ బెంచ్ ఈ మూడు రాష్ట్రాల అవసరాలను తీర్చనుంది. కస్టమ్స్, ఎక్సైజ్ సంబంధిత అప్పీళ్లు, పన్నుల చెల్లింపు వివాదాలు వంటివి పరిష్కరించుకునేందుకు ఈ ట్రిబ్యునల్ పని చేస్తుందని ట్రిబ్యునల్ రిజిష్ట్రార్ ఎ.మోహన్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

సెంట్రల్ వర్శిటీలో
రెండోసారి యునెస్కో పీఠం

హైదరాబాద్, డిసెంబర్ 11: సెంట్రల్ యూనివర్శిటీలో కమ్యూనిటీ మీడియా పేరిట యునెస్కో పీఠాన్ని 2019 వరకూ రెండోదఫా పునరుద్ధరించింది. సెంట్రల్ యూనివర్శిటీ డిపార్టుమెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈ పీఠాన్ని నిర్వహిస్తోంది. ఆ విభాగం అధిపతి ప్రొఫెసర్ వినోద్ పవరాల దీని నిర్వహణా బాధ్యతలు చూస్తున్నారు. కమ్యూనిటీ రేడియో, భాగస్వామ్య వీడియోలు, పౌర నియంత్రణ పత్రికలు నిర్వహణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ పీఠానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. దూర విద్య ద్వారా పిజి డిప్లొమో కోర్సులకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ దరఖాస్తులను స్వీకరిస్తోంది.
ప్రాజెక్టు మేనేజిమెంట్, బిజినెస్ మేనేజిమెంట్, సైబర్‌లా, ఫోరెన్సిక్ సైన్స్, కెమికల్ అనాలసిస్, హ్యుమన్ రైట్స్, లైబ్రరీ ఆటోమేషన్, నెట్ వర్కింగ్, కమ్యూనికేటివ్ ఇంగ్లీషు, మెడికల్ బోటనీ, ఎనర్జీ మేనేజిమెంట్ తదితర కోర్సులకు దరఖాస్తులను ఆబిడ్స్‌లోని గోల్డెన్ థ్రెషోల్డ్‌లోని దూరవిద్యా కేంద్రంలో పొందవచ్చని వర్శిటీ అధికారులు తెలిపారు. ఇతర సమాచారం కోసం 040-24600264 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చని అన్నారు.