తెలంగాణ

దేశాభివృద్ధికి పాటుపడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: భారతదేశం భవిష్యత్తు యువతపైనే ఉందని, వారు తలచుకుంటే దేశాన్ని ప్రపంచంలోనే ఉన్నతస్థితికి తీసుకురాగలుతారని తెలంగాణ రాష్ట్ర ఐటి మంత్రి కె. తారకరామారావు అన్నా రు. యువత తమ శక్తియుక్తులను దేశాభివృద్ధికి వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 155 వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రామకృష్ణామఠంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సమావేశానికి రావలసి ఉండిందని, స్వల్ప అనారోగ్యం కారణంగా రాలేకపోయారని ఆయన తెలిపారు. కెసిఆర్ పంపించిన సందేశాన్ని కెటిఆర్ ఈ సందర్భంగా చదివి వినిపించారు. వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకుని యువత పనిచేయాలని కెసిఆర్ తన సందేశంలో పిలుపు ఇచ్చారు. భారతదేశంలోని జనాభాలో 50 శాతం ప్రజలు 29 సంవత్సరాలలోపువారేనని కెటిఆర్ గుర్తు చేశారు. సమస్యలు అందరికీ ఎదురవుతుంటాయని, వీటిని అధిగమించేందుకు మార్గాలను ప్రతి యువకుడు అనే్వషించి, సమస్యలనుండి బయటకురావడమే కాకుండా జీవితంలో విజయం సాధించాలని సూచించారు. యువత తలచుకుంటే ఎలాంటి పనినైనా సులువుగా చేయగలుగుతుందని, స్వామి వివేకానంద కూడా ఇదే విషయాన్ని చెప్పారన్నారు. వివేకానంద జీవిత చరిత్రను ప్రతి యువకుడు చదవాలని, ఆయన బోధనలను అనుసరిస్తే, విజయం వారివద్దకు చేరుతుందన్నారు. ఎట్టిపరిస్థితిలోనూ యువత నిరాశా, నిస్పృహలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు. సత్యం, న్యాయం, ధర్మాన్ని యువత వీడవద్దని, వ్యక్తిగత సౌశీల్యం పెంపొందించుకోవాలని కెటిఆర్ పిలుపు ఇచ్చారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా భారత్‌కు యువశక్తి ఉందని, ఈ శక్తిని దేశాభివృద్ధికే వినియోగించాలని సూచించారు.

చిత్రం.. రామకృష్ణామఠంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయన మంత్రి కెటిఆర్