తెలంగాణ

హెడ్‌కానిస్టేబుల్‌ను చంపిన కానిస్టేబుల్‌కు జీవితఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ లీగల్, జనవరి 16 : హెడ్‌కానిస్టేబుల్‌ను తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్‌కు జీవితఖైధు విదిస్తూ నల్లగొండ జిల్లా జడ్జి డాక్టర్ జి.రాధారాణి సోమవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా వున్నాయి. నల్లగొండ మండలం అనె్నపర్తి 12వ బెటాలియన్‌లో 2010 నవంబర్ 7వ తేదీ సాయంత్రం విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ సిహెచ్.జి.వినారాయణపై అదే బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మొదాల వీరయ్య తన తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ సంఘ టనలో నారాయణకు నాలుగు గాయాలయ్యాయ. వెంటనే అతనిని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు బెటాలియన్ ఆర్‌ఎస్‌ఐ ఆర్.కేశవులు, నల్లగొండ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి రూరల్ సిఐలు ఈ.రవీందర్, కె.పాండురంగారెడ్డి విచారణ జరిపారు. మొదాల వీరయ్య, నారాయణ 12వ బెటాలియన్‌లో ఉద్యోగం చేస్తూ బెటాలియన్‌లోనే నివసిస్త్తున్నారని, వీరయ్య భార్యతో నారాయణకు అక్రమ సం బంధం ఉందన్న అనుమానంతో నారాయణను అంతం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నేరం చేసినట్లు పోలీసులు అంతిమ నివేదిక సమర్పించారు. వాదప్రతివాదనలు విన్న పిదప న్యాయమూర్తి తీర్పునిస్తూ వీరయ్యకు హత్యానేరం కింద జీవితఖైదు, వెయ్యి రూపాయల జరిమాన, ఆయుధాల చట్టం ప్రకారం జీవితఖైదు, వెయ్యి రూపాయల జరిమానా విధించారు. అయితే ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని ఆమె ఆ తీర్పులో వెల్లడించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరుపున పిపి ఎం.మారుతీరావు కులకర్ణి వాదించగా లైజన్ అధికారి భీమ్‌రెడ్డి సహకరించారు.