తెలంగాణ

భూమి అక్రమ ఖాతా మార్పు కేసులో రెవెన్యూ అధికారుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్దకల్, జనవరి 16: భూమి అక్రమ ఖాతా మార్పు కేసులో రెవెన్యూ అధికారులను అరెస్టు చేసి కోర్టుకు తరలించిన సంఘటన సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లాలో సంచలనం రేపింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన రైతు రత్నమ్మ పేర పాలవాయి గ్రామ శివారు సర్వేనెం.113, 114, 115లలో 30.18 ఎకరాలు ఉంది. ఈ భూమిని 2014లో అప్పటి తహశీల్దార్ సురేష్‌బాబు, డిప్యూటీ తహశీల్దార్ ఇఫ్తాకర్ అహ్మద్, రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ లతీఫ్, విఆర్‌ఓ వెంకటపతినాయుడు చేతివాటం ప్రదర్శించి అదే గ్రామానికి చెందిన ఆశన్న అలియాస్ అజయ్, కిష్టన్నల పేర ఆర్‌ఓఆర్, పహాణీలలో పేర్లు మార్చారు. రెవెన్యూ అధికారులు లక్షల్లో ముడుపులు తీసుకొని 30.18 ఎకరాల భూమిని ఇద్దరి పేర్ల ఖాతా మార్పు జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారమంతా మూడో కంటికి తెలియకుండా కొనసాగింది. ఈ విషయంపై రత్నమ్మ మనమడు శ్రీకాంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా బోగస్ సంతకాలతో రికార్డులు తారుమారు చేశారని బహిర్గతమైంది. దీంతో మల్దకల్ ఎస్‌ఐ జి.నవీన్‌సింగ్ ఆధ్వర్యంలో పోలీసులు రిటైర్డ్ తహశీల్దార్ సురేష్‌బాబు, డిప్యూటీ తహశీల్దార్ ఇఫ్తాకర్ అహ్మద్, రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ లతీఫ్, విఆర్‌ఓ వెంకటపతినాయుడులను సోమవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరుపర్చారు.