తెలంగాణ

ఎల్లంపల్లి పైపులైన్ గేట్‌వాల్ ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మారం, జనవరి 20: ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నందిమేడారం చెరువుద్వారా హైదరాబాద్ వరకు వెళ్తున్న ఎల్లంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పైపు గేట్‌వాల్‌ను గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో నీరు కొన్ని మీటర్ల ఎత్తువరకు ఎగసిపడింది. పెద్దఎత్తున నీరు వృధాగా పోతోంది. విషయం తెలుసుకున్న ఎల్లంపల్లి నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే మరమ్మతులు చేయడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. మల్లాపూర్ గ్రామానికి చెందిన చెరువులు, కుంటలు నింపడానికి రైతులు అర్ధరాత్రి గేట్‌వాల్‌ను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రెండుసార్లు ఇదే ప్రాంతంలో గేట్‌వాల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు విప్పడంతో మల్లాపూరు గ్రామంలోని ఊర చెరువు, కమ్మరిఖాన్‌పేట గ్రామ సమీపంలోని రెండు చెరువులు మత్తడి పడ్డాయి. తాజాగా మూడవ సారి గుర్తు తెలియని వ్యక్తులు అదే పని చేయడంతో కుంటలు, చెరువులు నిండి నీరు వృధాగా పోతోంది. విషయం తెలిసిన ఎల్లంపల్లి నీటిపారుదల శాఖ డివిజనల్ ఇంజనీర్ రావు పర్యవేక్షణలో శుక్రవారం మరమ్మతులు చేపట్టి గేట్‌వాల్ మూయించారు.