తెలంగాణ

ప్రభుత్వ పథకాల్లో ప్రజా భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: ప్రభుత్వ పథకాల రూపకల్పనలో ప్రజా భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్షించారు. ప్రజలకు అవసరమైన రీతిలో పథకాల రూపకల్పనకు వారితో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు తమ అభివృద్ధి, సంక్షేమానికేననే విశ్వాసం ఆయా వర్గాల్లో కలగాలన్నారు. వ్యవసాయం, ఉద్యాన వనాలు, నీటిపారుదల, మత్స్యశాఖ, గొర్రెల పెంపకం తదితర అంశాలపై సిఎం కెసిఆర్ ప్రగతి భవన్‌లో శనివారం సమీక్ష జరిపారు. ఎక్కువమంది వ్యవసాయంపై ఆధారపడతారని, వ్యవసాయానికి అనుబంధ పథకాలుగా గొర్రెల పెంపకం, మత్స్యశాఖ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. త్వరలోనే మత్స్యకారులు, గొర్రెల పెంపకందారులతో జనహితలో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆయా రంగాల్లో ప్రస్తుత పరిస్థితి , భవిష్యత్‌లో తీసుకునే నిర్ణయాలు, చేయాల్సిన కార్యక్రమాలపై డాక్యుమెంటరీ రూపొందించి అవగాహన కలిగించాలని కెసిఆర్ అధికారులకు సూచించారు. నీటిపారుదలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల తెలంగాణలో సాగుభూమి పెరుగుతుందని, తెలంగాణలో ఎలాంటి భూములకు ఎలాంటి పంటలు అనుకూలమైనవి? మార్కెటింగ్ పరిస్థితి వంటి అంశాలపై రైతులకు అవగాహన కలిగించాలని ఆదేశించారు. ఫామ్ మెకనైజేషన్, గ్రీన్ హౌజ్, పాలీ హౌజ్ కల్టివేషన్ ద్వారా ఎలాంటి పంటలు పండించవచ్చనే అంశాలపై అవగాహన కలిగించాలన్నారు.
తెలంగాణలో భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగయ్యాయి. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కానున్నాయని వివరించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో మన వాటా మనకు దక్కుతుందని, ఇవన్నీ చేపల పెంపకానికి అనువైన పరిస్థితులు, మత్స్య సంపద పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వివరించారు. ఇతర ప్రాంతాల నుంచి చేపలు దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి ఎగుమతి చేసే స్థితికి చేరుకుంటామన్నారు. చేప పిల్లల ఉత్పత్తి, పెంపకం, మార్కెటింగ్ వసతుల కల్పన భారాన్ని ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. నిర్వాహణా వ్యయం పోను మిగిలిన లాభమంతా మత్స్యకారులకే దక్కేలా విధాన పరమైన నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. చేపలు పట్టుకుని జీవించే అన్ని కులాలు, కుటుంబాలకు మేలు కలిగే విధంగా చేపల పెంపకం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఏడాదికి లక్ష చొప్పున కనీసం రెండు లక్షల మందికి ప్రభుత్వమే గొర్రె పిల్లలు కొని ఇవ్వాలని నిర్ణయించినట్టు కెసిఆర్ చెప్పారు. సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నీటిపారుదల శాఖ ఇఎన్‌సి మురళీధర్‌రావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్ మోహన్ ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

చిత్రం... గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కెసిఆర్ రాజ్‌భవన్‌లో శనివారం
సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గవర్నర్‌తో చర్చిస్తున్న సిఎం కెసిఆర్