తెలంగాణ

వరంగల్-హైదరాబాద్ మధ్య మినీ ఎసి బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 21: వరంగల్ నగరంలోని పలు కాలనీల ప్రజలకు తమతమ కాలనీల నుంచే ఆర్టీసీ బస్సులలో హైదరాబాద్‌కు వెళ్లడానికి, తిరిగి రావడానికి అవకాశం ఏర్పడనుంది. టిఎస్‌ఆర్టీసీ కొత్తగా కొనుగోలు చేసిన మినీ ఎసి బస్సులను వజ్ర పేరుతో వరంగల్ నగరంలోని వివిధ కాలనీల నుంచి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు, తిరిగి అక్కడి నుంచి వరంగల్ నగరంలోని వివిధ కాలనీలకు ప్రజలను చేరవేసే సౌకర్యం ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్‌లోని నాలుగు రూట్ల ద్వారా వరంగల్ నగరానికి వజ్ర మినీ ఎసి బస్సులను నడిపేందుకు వరంగల్ రీజియన్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి రూటు హైద్రాబాద్‌లోని సరూర్‌నగర్ నుంచి నాగోలు క్రాస్‌రోడ్డు, ఉప్పల్ క్రాసురోడ్డు ద్వారా వరంగల్‌కు మినీ ఏసి బస్సులు నడుపుతారు. రెండవ రూటు హైద్రాబాద్‌లోని మెహిదీపట్నం నుంచి హిమాయత్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు ద్వారా వరంగల్‌కు ఏసి బస్సులు నడుస్తాయి. మూడవ రూటు కెపిహెచ్‌బి నుంచి బాలానగర్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ క్రాస్‌రోడ్డు ద్వారా వరంగల్‌కు ఏసి మినీ బస్సులు నడుపుతారు. నాలుగవ రూటు ఎఎస్‌రావు నగర్ నుంచి ఇసిఐఎల్ క్రాస్‌రోడ్డు, హబ్సిగూడ, ఉప్పల్ ద్వారా వరంగల్‌కు ఏసి బస్సులు నడుపుతారు. హైద్రాబాద్‌లోని నాలుగు రూట్లలో నడిచే ఏసి బస్సులు హైదరాబాద్ నగరంలోని 100 పాయింట్లలో ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటారు. అదేవిధంగా వరంగల్ నగరంలో ఈ బస్సులలో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు 46 పాయింట్లను ఏర్పాటు చేసారు. ఈ బస్సులు హైద్రాబాద్, వరంగల్ నగరాలలోని బస్‌స్టేషన్లకు వెళ్లకుండా ప్రత్యేకంగా ఎంపిక చేసిన పాయింట్ల వద్ద నుంచే ప్రయాణికులను ఎక్కించుకుంటారు. 21 సీట్ల కెపాసిటీతో కలిగిన వజ్ర మినీ ఏసి బస్సులలో ఆన్‌లైన్ విధానంలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకోవలసి ఉంటుంది. ప్రతిరోజు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు 15 బస్సులు, ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి వరంగల్‌కు మరో 15 బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజు వరంగల్-హైదరాబాద్ మధ్య ఆరవై ట్రిప్పులు తిప్పాలని ప్రాథమికంగా నిర్ణయించామని, ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తే మరిన్ని ట్రిప్పులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసి వరంగల్ రీజియన్ మేనేజర్ సూర్యప్రకాష్ తెలిపారు.