తెలంగాణ

శాస్ర్తియంగా బడ్జెట్‌కు రూపకల్పన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 21: పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలు, కొత్తగా అమలులోకి రానున్న జిఎస్టీ పన్ను విధానంతోపాటు నాన్ ప్లానింగ్ బడ్జెట్, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ఇతరత్రా అంశాలు పరిగణలోకి తీసుకుని ఈసారి శాస్ర్తియంగా బడ్జెట్‌కు రూపకల్పన చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఏప్రిల్ ఒకటి నుంచి ఒంటరి మహిళలకు రూ.1000 పెన్షన్ అందించనున్నట్లు తెలిపారు. శనివారం కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బి అతిథి గృహం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జివో లు, నిబంధనలు ముఖ్యం కాదని, రాష్ట్భ్రావృద్ధిలో కీలక భూమిక పోషించే రైతుల సంక్షేమమే ధ్యేయం గా తమ ప్రభుత్వం ముందుకువెళ్తోందని స్ప ష్టం చేశారు. ఎస్సారెస్పీ పరిధిలోకి వచ్చే వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని మొగుళ్ళపల్లి, చిట్యాల, శ్రీరాంపూర్, ఓదెల మండలాల్లోని చివరి ఆయకట్టు భూమికి కూడా నీరందించడం చరిత్రలో మొదటిసారని అన్నారు. రైతుల కోసమే నిబంధనలను పక్కనబెట్టి ఎస్సారెస్పీ నుంచి వరద కాలువకు నీటిని విడుదల చేసినట్లు ప్రకటించారు. వరద కాలువ ఆయకట్టుదారుల కోసం 3 వేల క్యూసెక్కుల నీటిని వదిలినట్లు చెప్పారు.
అధికారం లేకపోతే బతుకేలేదన్నట్లుగా వ్యవహరిస్తున్న ప్రతిపక్ష కాంగ్రె స్ అనైతిక ఆరోపణలు చేస్తూ, ప్రభుత్వంపై బురదజల్లే యత్నం చేస్తోం దని మండిపడ్డారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని, ప్రతి పనిని విమర్శించి తమ కుసంస్కార విధానాన్ని తేటతెల్లం చేసుకోవద్దని మంత్రి హితువు పలికారు. బడ్జెట్ సమావేశాల అనంతరం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నట్లు, జిల్లాలోని అన్ని గ్రామాలకు చిన్నముల్కనూర్ ఆదర్శంగా మారబోతుందన్నారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి, ప్రజాప్రతినిధులు గ్రామాల్లోనే మకాం వేసి శరవేగంగా ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. గుడిసెలో నివసించే పేదలకు మొదటి ప్రాధాన్యతగా ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు, ఇప్పటివరకు 88 శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాగా, 12 శాతం మిగిలిఉన్నట్లు పేర్కొన్నారు. నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసి, రికార్డు నెలకొల్పేందుకు అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మేయర్ రవీందర్‌సింగ్, తెరాస నాయకులు జి.వి. రామకృష్ణారావు, కలర్ సత్తయ్య, ఎడ్ల అశోక్, సునీల్‌రావు, కట్ల సతీష్, కల్పన రవీందర్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్