తెలంగాణ

కల్యాణలక్ష్మికి సీలింగ్ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, జనవరి 21: కల్యాణలక్ష్మి పథకానికి ఎలాంటి సీలింగ్ లేదని, నిరుపేదలైన అర్హులందరికీ ఈ పథకం కింద 51 వేల రూపాయలు వివాహ సమయంలో ప్రభుత్వం అందజేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఇక నుండి వివాహాలకు మూడు రోజుల ముందే పెళ్లి కుమార్తె తల్లికి ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును పంపిణీ చేస్తామని చెప్పారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పద్మశాలి భవన్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల కింద 355 మంది లబ్ధిదారులకు కోటి 81 లక్షల రూపాయల చెక్కులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మహబూబాబాద్ ఎంపి అజ్మీరా సీతారాంనాయక్, రాష్ట్ర ఫౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ గద్దల పద్మ, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా కల్యాణలక్ష్మి పథకం పేదలందరికీ వర్తిస్తుందని తెలిపారు. జిల్లా విభజన మూలంగా లబ్ధిదారులకు ఆలస్యంగా చెక్కులను పంపిణీ చేస్తున్నామని, ఇక నుండి వివాహాలకు మూడు రోజుల ముందే కల్యాణలక్ష్మి పథకం లబ్ధిని వివాహిత తల్లికి అందజేస్తామని అన్నారు. కల్యాణలక్ష్మి లబ్ధి పొందేందుకు పెళ్లి కార్డు, రేషన్ కార్డు, 18 సంవత్సరాలు నిండినట్లు తగిన వయస్సు ధృవీకరణ పత్రాలను తహశీల్దార్లకు అందజేయాలని కోరారు. ప్రతి పథకాన్ని బడ్జెట్ ఉంటుందని, కల్యాణలక్ష్మి ఎలాంటి బడ్జెట్, సీలింగ్ లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు పింఛన్ల కోసం కేవలం 835 కోట్లు మాత్రమే వెచ్చించాయని, తమ ప్రభుత్వం 37 లక్షల మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేసిందన్నారు. ఈ పింఛన్లకు సాలీనా 4600 కోట్ల రూపాయలను ఇస్తున్నామని ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చుకున్నా ఒంటరి మహిళలకు సైతం పింఛన్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారని, నిజంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మనసున్న మారాజని అన్నారు.

‘పేట’లో దారుణం
ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై అత్యాచారం
నిందితుల రిమాండ్
సూర్యాపేట, జనవరి 21: పాఠశాలకు వెళ్తున్న ఇద్దరు విద్యార్థినులకు మాయమాటలు చెప్పి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలావున్నాయ. మండల పరిధిలోని రాయినిగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు పట్టణంలోని బిసి బాలికల వసతిగృహంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటున్నారు. రోజుమాదిరిగానే ఈనెల 18న హాస్టల్ నుండి బయలుదేరి పాఠశాలకు వెళ్తుండగా మార్గమధ్యలో రాయినిగూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నామ రాజశేఖర్, మెకానిక్ ఎలుముల సైదులు ఎదురుపడి ముచ్చటించారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తులు కావడంతో బాలికలు కొంతసేపు ముచ్చటించగా మాయమాటలతో వారిని ఆటోలో ఎక్కించుకొని పట్టణ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తిరిగి సాయంత్రం పట్టణంలో వదిలి జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. సాయంత్రం హాస్టల్‌కు చేరుకున్న విద్యార్థినులు మరుసటిరోజు అనారోగ్యానికి గురికావడంతో ఇంటికి వెళ్లారు. శుక్రవారం రాత్రి జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు తెలుపగా వారు ఈ మేరకు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో నిందితులపై అత్యాచారం, ఫోక్‌సో కింద కేసులు నమోదుచేసి నిందితులను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు పట్టణ ఇన్స్‌స్పెక్టర్ వై. మొగిలయ్య తెలిపారు.