తెలంగాణ

గ్రంథాలయాల డిజిటలైజేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: రాష్ట్రంలో గ్రంథాలయాల డిజిటలైజేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తి చేస్తామని, వీటితో పాటు కొత్త పుస్తకాల కొనుగోలు త్వరలోనే ప్రారంభించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఉద్యోగుల వేతనాలు 010 పద్దు ద్వారా చెల్లించాలని ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్టు , కొన్ని కారణాల వల్ల తిరిగి వచ్చిందని చెప్పారు. గ్రంథాలయాల్లో కొందరు ఉద్యోగులు 010 పద్దు ద్వారా వేతనాలు పొందుతుండగా, మిగిలిన కొందరికి రావడం లేదని అన్నారు. ఓకే విభాగంలో రెండు రకాల వేతనాలు పొందే వ్యత్యాసం ఉండవద్దని, ముఖ్యమంత్రితో చర్చించి 010 పద్దు ద్వారా వేతనాలు వచ్చే విధంగా మరోసారి ఫైలు పంపిస్తానని చెప్పారు.
హైదరాబాద్‌లోని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ హాలులో నిర్వహించిన గ్రంథాలయ ఉద్యోగుల రాష్ట్ర సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కడియం శ్రీహరి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. 31 కొత్త జిల్లాలు ఏర్పడినందున, కొత్త జిల్లాల్లో గ్రంధాలయాల అప్‌గ్రెడేషన్ జరుగుతోందని చెప్పారు. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో భూమి ఇస్తే గ్రంథాలయాలు నిర్మించుకుంటామని, బిల్డింగ్ ఇస్తే గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్లను అడగాలని గ్రంథాలయ డైరెక్టర్‌కు చెప్పినట్టు తెలిపారు. గ్రంథాలయాలను డిజిటలైజేషన్ చేసుకోవాలని, ప్రతి జిల్లా గ్రంథాలయంలో ఇంటర్నెట్, వైఫై, కంప్యూటర్లు కచ్చితంగా ఉండాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన పని కొనసాగుతోందని కడియం శ్రీహరి తెలిపారు. గ్రంథాలయ సెస్సును మున్సిపాలిటీలు ఇవ్వడం లేదని, వాటిని వసూలు చేయాలని అన్నారు.
కేంద్రం నిధులు ఇస్తుందని, వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చి గ్రంధాలయాలను పటిష్టపరచనున్నట్టు చెప్పారు. గ్రంధాలయాల్లో పుస్తకాలను బాగా కొనాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమావేశంలో ముఖ్యమంత్రి ఒఎస్‌డి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ దేవాలయాల అర్చకులకు 010 ద్వారా వేతనాలు వస్తున్నాయని, గ్రంథాలయాల అర్చకులైన ఉద్యోగులకు కూడా 010 ద్వారా వేతనాలు రావాలని అన్నారు.
సమావేశంలో గ్రంధాలయ సంస్త సంచాలకులు ఎస్ వెంకటేశ్వర శర్మ, టిఎన్‌జివో గౌరవ అధ్యక్షులు దేవీ ప్రసాద్, టిఎన్‌జివో అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి, గ్రంధాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దేవేందర్, కార్యదర్శి అయోధ్య తదితరులు పాల్గొన్నారు.