తెలంగాణ

ప్రజా అజెండాకు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: ఎన్నికల తతంగం, మోడల్ కోడ్ ముగిసిన తరువాత రాష్ట్ర ప్రగతి, ప్రజల అజెండాను చిత్తశుద్ధితో అమలు జరిపేందుకు కార్యాచరణ రూపొందించనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు తెలిపారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి ప్రజల అజెండా అమలుకు రంగంలోకి దిగనున్నట్టు చెప్పారు. ఉద్యమ సమయంలో అనేక జిల్లాల్లో పర్యటించినా, ఈ మధ్య సమయం అంతగా లభించలేదన్నారు. త్వరలోనే అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. శాసన మండలి ఎన్నికల్లో ఆరుస్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైనవారు క్యాంపు కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రిని కలిశారు. కొత్తగా ఎంపికైన ఎమ్మెల్సీలతోపాటు మంత్రులు, పార్టీ నేతలు సిఎంను కలిసిన వారిలో ఉన్నారు. పోటీ చేసిన పనె్నండు స్థానాల్లో ఆరు స్థానాలు ఏకగ్రీవంగా గెలవడం జాతీయ స్థాయిలోనే చరిత్ర సృష్టించినట్టని సిఎం వారిని అభినందించారు. చరిత్ర సృష్టించిన విధంగా గెలిచిన వారిని అభినందిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల వరంగల్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత మళ్లీ ఇదొక అద్భుత విజయమని వ్యాఖ్యానించారు. అయితే వరుస విజయాలు సాధిస్తున్నందుకు మనం గర్వపడకూడదని ముఖ్యమంత్రి సూచించారు. జయాపజయాలు ఎన్నికల్లో సాధారణమని, అందుకే విజయం సాధించినందుకు విర్రవీగొద్దని, అపజయాలకు కుంగిపోకూడదని హితవు పలికారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉన్నారని ఈ విజయంతో స్పష్టమైందని అన్నారు.
వరంగల్ జిల్లా ఉద్యమానికి ఎంతో మద్దతిచ్చిందని, ఇప్పటికీ ప్రజల నుంచి ఆ మద్దతు అలానే కొనసాగుతోందని అనడానికి నిదర్శనమే ఉప ఎన్నికల్లో అత్యధికంగా 70శాతం మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారని అన్నారు. ఒక సాధారణ కార్యకర్తకు నాలుగు లక్షల 59వేల ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించడం గొప్ప విషయంగా అభివర్ణించారు. ఇది ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని కెసిఆర్ తెలిపారు. గెలుపు నుంచి కూడా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు మనల్ని ఎంత నమ్మకంతో గెలిపిస్తున్నారో, మనమూ అదే మోతాదులో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సిఎం అన్నారు.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గొప్పగా ముందుకు తీసుకుపోవాలని, పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మంత్రులు తమ శాఖలతోపాటు తమ జిల్లాకు చెందిన అన్ని రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించాలని సూచించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులంతా కలిసి మాట్లాడుకుని పనులు త్వరితగతిన అమలు జరిగేలా చూడాలని సిఎం సూచించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ సలహాదారు డి శ్రీనివాస్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములు, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య, ఎంపీలు సీతారాం నాయక్, బాల్కసుమన్, పలువురు ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ఉన్నారు.