తెలంగాణ

తెలంగాణకు ఏమి తెచ్చావ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: పెద్ద నోట్ల రద్దును సమర్థించిన ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఉపయోగపడే ప్రయోజనాలను సాధించలేకపోయారని కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీని పెద్ద నోట్ల రద్దులో సమర్థించిన కెసిఆర్ తెలంగాణకు ఏమి తెచ్చారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ ప్రజలను నిరాశపరిచిందన్నారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నోట్ల రద్దు చేసిన సమయంలో గంభీరమైన ప్రకటనలు చేసిన మోదీ, బడ్జెట్ తర్వాత గాలి తీసిన టైర్‌లా కనపడ్డారన్నారు. కేంద్ర బడ్జెట్‌కు దిశ, దశ లేదన్నారు. చమురు ధరలు తగ్గడం వల్ల ఒక లక్ష కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని, కాని బడ్జెట్‌లో సామాన్యులకు ఎటువంటి ప్రయోజనం కల్పించలేదన్నారు. గత 70 సంవత్సరాల్లో ఇంత ప్రజావ్యతిరేక బడ్జెట్‌ను తాను చూడలేదన్నారు. బడ్జెట్‌లో కొత్త పరిశ్రమల ఊసు లేదన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్రమైన ఇక్కట్ల గురయ్యాయని, పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకున్నాయన్నారు. రాజకీయ పార్టీలకు నిధులను సేకరించడంపై చేసిన ప్రతిపాదనలు కంటితుడుపు చర్యలేనన్నారు.